GET MORE DETAILS

ఉగాది ప‌చ్చ‌డి తింటే లాభ‌మేంటి...?

 ఉగాది ప‌చ్చ‌డి తింటే లాభ‌మేంటి...?



ఉగాది మన తెలుగు పండుగ. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

చైత్రశుద్ధ్య పాడ్యమి రోజు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రముఖ్యత ఉంది.ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడంతో పాటు ఉగాది ప‌చ్చ‌డిని ప్రసాదంగా తీసుకుంటాం.మరి షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో ఉగాది ప‌చ్చ‌డి కీలక పాత్ర పోషిస్తోంది.ఇందులో వాడే ఆరు రకాల పదార్థాలైన బెల్లం,వేప పువ్వు, చింతపండు,ఉప్పు,పచ్చి మామిడి,కారం రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.మరి ఈ ఆరు రకాల పదార్థాలు మన శరీరానికి ఎలా మేలు చేస్తాయో చూద్దామా!

1) బెల్లం :

ఉగాది ప‌చ్చ‌డిలో తీపి కోసం బెల్లం వాడుతాం.జీవితంలోని ఆనందం,సంతోషానికి తీపిని గుర్తుగా చెప్పుకుంటాం.లివర్లోని విష పదార్థాలను బయటకు పంపేయడంలో బెల్లం సహాయపడుతుంది.ఇందులోని జింక్,సెలీనియం,యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నిరోధిస్తాయి. ఇందులోని ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.అలాగే బెల్లం తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి వస్తుంది.

2) పచ్చి-మామిడి :

వగరు రుచి కోసం పచ్చి మామిడిని వాడుతుంటాం.ఎండాకాలంలో కాసే మామిడి డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది.రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.రక్తనాళాల సాగే గుణాన్ని పెంచుతుంది.ఇందులోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఎసిడిటీఛాతి నొప్పిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగు పరచడంలో మామిడి కాయలోని పీచు ఉపయోగపడుతుంది.

3) వేప-పువ్వు :

వేప పువ్వు ద్వారా ఉగాది పచ్చడికి చేదు రుచి వస్తుంది.ఆయుర్వేదం ప్రకారం వేప పువ్వుకు 35 రకాల వ్యాధుల తో పోరాడే శక్తి ఉంది.వేపను తినడం ద్వారా మన శరీరంలో అనారోగ్యానికి గురి చేసే క్రిములు నాశనమవుతాయి.రక్తాన్ని శుద్ధి చేసి,చర్మ వ్యాధులను నిరోధించడంలో నూ వేప సహాయపడుతుంది.మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చక్కటి మందులా పనిచేస్తుంది.కేవలం వేప పువ్వులోనే కాదు. వేపాకులు,వేప పండ్లు,వేప జిగురు,వేప కళ్లు వీటన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.

4) కారం :

ఇమ్యూనిటీ పెంచడంలో కారం చక్కగా పనిచేస్తుంది.కారంలో ఉండే క్యాప్సుచైన్ అనే పదార్థం నొప్పి నివారణిగా పనిచేస్తుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూడటంతో పాటు జీర్ణశక్తిని పెంచడానికి,బరువు తగ్గడానికి కారం సహాయపడుతుంది.

5) ఉప్పు :

వేస‌విలో డీహైడ్రేష‌న్ నుంచి కాపాడ‌టంలో ఉప్పులోని సోడియం స‌హాయ‌ప‌డుతుంది. రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్‌తో పాటు నీర‌సాన్ని త‌గ్గిస్తుంది.

6) చింత‌పండు :

ఉగాది ప‌చ్చ‌డికి చింత పండుతో పులుపు రుచి వ‌స్తుంది.మిన‌ర‌ల్స్‌ను శ‌రీరం సుల‌భంగా గ్ర‌హించేందుకు చింత‌పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.శ‌రీరంలో ఇన్‌ఫ్ల‌మేష‌న్ లేకుండా చూస్తుంది.అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంతో పాటు కొవ్వుస్థాయుల‌ను నియంత్రిస్తుంది.

Post a Comment

0 Comments