GET MORE DETAILS

పిల్లలులో ముక్కు నుండీ రక్తం పడుతోందా...?

 పిల్లలులో ముక్కు నుండీ రక్తం పడుతోందా...? 



ఉన్నట్లుండి కొందరికి హఠాత్తుగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. ఎన్ని పరీక్షలు చే సినా కారణమేమీ కనపడదు. ఇంకొంత మందికి నోట్లో నుంచి రక్తం పడుతుంది. మరికొంతమందికి మలద్వారం, మూత్రమార్గం నుంచి రక్తస్రావం అవుతుంది. ఈ పరిణామాన్నే ఆయుర్వేదం రక్తపిత్త వ్యాధి అంటుంది!

వ్యాధికి ముందు కనిపించే లక్షణాలు : 

భోజనంపైన అయిష్టత, తిండి అరగక మంట పుట్టడం, త్రేన్పులు, వికారం, వాంతులు, మలమూత్రాలు రక్తవర్ణంగా మారడం లేదా ఆకు పచ్చగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ అవయవం పైన అయినా ఎర్రటి మచ్చలు ఏర్పడితే ఆ భాగాల్లో రక్తస్రావం జరిగిందని గ్రహించాలి. వెంటనే వైద్య చికిత్సలు మొదలుపెట్టాలి.

ఒక సామాన్య చికిత్సగా రక్తపిత్తాన్ని నయం చేయడంలో అడ్డసరం మూలిక అత్యుత్తమంగా పనిచేస్తుంది.

వాడే విధానం :

అడ్డసరం ఆకులను శుభ్రపరిచి, దంచి, పచ్చి రసం తీసి తేనెతో తీసుకోవాలి. చిన్న పిల్లలకైతే, 3 నుంచి 5 మిల్లీ లీటర్ల చొప్పున భోజనానికి ముందు ఉదయం, సాయంత్రం తేనెతో కలిపి ఇవ్వాలి.  పెద్దవాళ్లైతే 10 నుంచి 15 మి.లీ మోతాదులో ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.

Post a Comment

0 Comments