GET MORE DETAILS

మన ఆరోగ్యం - మన ఆయుర్వేదం

 మన ఆరోగ్యం - మన ఆయుర్వేదం



ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దుష్రచారాలలో, ఆరోగ్య సంబంధిత అవగాహన పై జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఆహారం గురించి.  మనం రోజూ తినే అన్నం గురించి, ఏ విధంగా దుష్రచారం జరుగుతుందనేది తెలుసుకుందాం.

ఆయుర్వేద వైద్యంలో వరి ధాన్యం ద్వారా వచ్చిన బియ్యం గురించి ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. వరిపండించడానికి సరిపడా నీరు ఉండాలి. లేకపోతే వరిపంట సాధ్యం కాదు. అలా పూర్వం కొన్ని ఊర్లకి నీటి వసతి లేనికారణంగా, ఆ చుట్టుపక్కల వరి పండించలేక, కొన్ని రకాల చిరుధాన్యాన్ని ఆహారానికి ఉపయోగించేవారు. అంతేకాని, బియ్యం తినడం తప్పని, అప్పుడు ఎవరూ అనుకునేవారు కాదు.

ఈ రోజుల్లో దాదాపు ప్రతి కుటుంబంలో షుగర్ పేషంట్లు ఉన్నారు. కాబట్టి షుగర్ ఉన్నోళ్ళు అన్నం తింటే, షుగర్ పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అన్నంలో గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది కానీ, అది జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. బయట నుంచి తీసుకునే గ్లూకోజ్ లా కాకుండా, వరి పండించ గా వచ్చిన ధాన్యం నుండి వచ్చిన బియ్యం లో ఉండేది మనకి మంచే చేస్తుంది. కాకపోతే ఎక్కువ సార్లు పాలిష్ చేసిన బియ్యం వలన మనకి అజీర్ణసమస్యలు వస్తున్నాయి తప్ప, బియ్యం వాడటమే తప్పని కాదు.

Post a Comment

0 Comments