GET MORE DETAILS

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆరాధన

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆరాధన



తిరుమల శ్రీవారి ఆలయమునకు మరియు శ్రీ వైఖానస భగవదారాధనా విధానమునకు, అత్యంత ప్రాచీన కాలం నుండే అవినాభావ సంబంధం ఉందని అష్టాదశ పురాణాలు మరియు అనేక శ్రుతి ప్రమాణములు తెలియజేస్తున్నాయి.

  గరుడ పురాణంలో శ్రీవారి ఆలయ ఆరాధన విధానమును గురించి ఒక ఆసక్తికరమైన శ్లోకం ఉంది. (ఇదే శ్లోకం శ్రీ వైఖానస భృగు సంహిత ప్రకీర్ణాధికారంలో కూడా పొందుపరచబడింది). 

   విష్ణ్వంశ సంభూతుడైన భగవాన్ విఖనస మహర్షి శిష్యులైన ఋషులు, అత్రి, భృగు, మరీచి మరియు కశ్యపుడు, గురువు గారు ఆదేశం మేరకు అనేక వైఖానస సంహితలను రచించి వాటి ఆధారంగా ఈ భూమండలంలో విష్ణువును ఆరాధించినారు. 

   మరీచి మహర్షి- మందర క్షేత్రంలో, అత్రి శ్రీనివాస క్షేత్రంలో, కశ్యపుడు విష్ణ్రధిష్ఠాన క్షేత్రంలో మరియు భృగుమహర్షి శుభక్షేత్రంలో, శ్రీ వైఖానస భగవచ్చాన విధిగా శ్రీ మహావిష్ణువు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు. 

   పై క్షేత్రములలో మూడు మాత్రం ఏవి అనే ఆధారాలు దొరకలేదు కాని అత్రి ఆరాధించిన శ్రీనివాస క్షేత్రం మాత్రం తిరుమల అని స్పష్టంగా చెప్పవచ్చు.

   భగవాన్ విఖనస మహర్షి భగవాన్ విఖనస మహర్షి విష్ణు మానస పుత్రుడుగా ఆగమశాస్త్రాల్లో చెప్పబడివుంది. ఆదికాలంలో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని రచించిన విఖనసుడు స్వయంగా బ్రహ్మ అని మరీచి ఆనందసంహిత తెలియజేస్తోంది.

విఖనస మహర్షి వంశీయులే లోకంలో 'వైఖానసులు గా ప్రసిద్ధి చెందింది.

   విఖనుడే విష్ణువు. ఆయన వంశస్థులు వైఖానసులు. విష్ణు వంశజుడైన విఖనసుడు మునులలో ప్రథముడు. ఆయన ఉపదేశించిన సూత్రం, సూత్రములన్నింటి లోకి ఉత్తమమైనది. భగవంతుడైన మహావిష్ణువు

  భూలోకమునందు అర్చావతార రూపంలో అవతరించ దలచినాడు. విష్ణువును ఆరాధించుటకు ఒక సమగ్రమైన ఆరాధన విధానం అవసరమైంది. అందువల్ల మహావిష్ణువు, బ్రహ్మను సృష్టించి, తన ఆరాధనకై ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించమని ఆదేశించారు. 

  కాని బ్రహ్మదేవుడు తన అశక్తతను తెలియజేయగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మనస్సులో సమస్త వేదరాశిమీద దృష్టి నిలిపి ధ్యానించాడు. తత్ఫలితంగా, భగవాన్ విఖనస మహర్షి విష్ణువు

  మనస్సు నుండి ఉద్భవించినాడు. లక్షణంగా, దివ్యమైన తేజస్సుతో విష్ణు చిహ్నాలైన, చతుర్భుజములు, శంఖ, చక్రములు, అభయ వరద హస్తములతో, ద్వాదశ ఊర్ధ్వపుండ్ర ధారియై, కమండలం మరియు త్రిదండం చేతబూని తులసి, పద్యమాల, కిరీట కర్ణకుండలములతో వెలుగొందుతున్న వైఖానసుడు భగవంతునికి నమస్కరించి "ఆజ్ఞాపించిన అడుగగా, విష్ణువు తన ఆరాధనకై శాస్త్రమును రూపొందించుమని ఆదేశించినాడు. 

  విఖనసుడు వేదరాశి మీద ధ్యానించి మహత్తరమైన శ్రీ వైఖానస కల చిత్రాన్ని రూపొందించాడు. ఇదే తర్వాతి కాలంలో విఖనసుడి శిష్యాదులచే విస్తరింపబడి, శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రం అను పేరుతో ప్రసిద్ధి చెందినది.

Post a Comment

0 Comments