GET MORE DETAILS

త్రివిధ దళాల్లో కొలువు+కోర్సు

 త్రివిధ దళాల్లో కొలువు+కోర్సు



ఇంటర్మీడియెట్తోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ పనెంట్ కమిషన్ ర్యాంకు కొలువు సొంతం చేసుకోవచ్చు. త్రివిధ దళాల్లో కెరీర్ తోపాటు బ్యాచిలర్ డిగ్రీకి మార్గం. నేషనల్ డిఫెన్స్. అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (ఎన్డీఏ, ఎన్ఏ) యూపీఎస్సీ తాజాగా 56.56-2(2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3న పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక దశలు. పరీక్ష విధానం, సిలబస్: ప్రిపరేషన్ తదితర వివరాలు.

మొత్తం 395 పోస్ట్లు

• ఎన్ఐఏ, ఎన్ఎ(2)-2023 నోటిఫికేషన్ ద్వారా. మొత్తం 95 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరు గుతుంది. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో.. ఆర్మీ-2018 (మహిళలకు 10 పోస్ట్లు). నేవీ 42 (మహిళలకు 12 పోస్ట్లు) -ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ విభాగంలో 12, ఎయిర్పోర్స్ గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) 18, ఎయిర్పోర్స్ గ్రౌం డ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) 10 ఖాళీలు: అలాగే నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) 25 (మహిళలకు 7) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎయిర్ ఫోర్స్కు సంబంధించి మూడు విభాగాల్లోనూ ప్రతి విభాగంలో మహిళలకు రెండు పోస్టు కేటాయించారు. నేవల్ అకా డమీ 10-2 కేడట్ ఎంట్రీ స్కీమ్లో ఈ ఏడాది నుంచి కొత్తగా మహిళా అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.

అర్హతలు:

• ఆర్మీ వింగ్! ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. 

• ఎయిర్ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.

• ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థు లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 

జనవరి 2, 2005 జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ఎన్టీఏ, ఎన్ఎకు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియ, తొలి దశలో యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో ఎస్ఎస్ ఆధ్వర్యం లో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి.

శిక్షణతోపాటు బ్యాచిలర్ డిగ్రీ:

ఎన్టీఏ, ఎన్ఏ రాత పరీక్షతోపాటు ఎస్ఎసి ఎంపిక ప్రక్రియల్లో విజయం సాధించి.. తుది జాబి తాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ ఆరా డమీ, నేవల్ అకాడమీల్లో మూడేళ్లు శిక్షణనిస్తారు.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న విభాగాలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొ నాల్సి ఉంటుంది. ఆర్కీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగం లకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. పుణెలో, నేవల్ అకాడమీ అభ్యర్థులకు ఎజిమల లోని నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ ఆకారమీ - పుణెలో.. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకే విధంగా శిక్షణ ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్ యూ-ఢిల్లీ నుంచి బీఏ, బీఎసీసీ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను అందిస్తారు. 

• ఎయిర్పోర్స్, నేవల్ విభాగాలను ప్రార మ్యంగా ఎంపిక చేసుకున్న వారికి బీటెక్ చదివేం దుకు కూడా అవకాశం ఉంటుంది. వీరు ఈ విష యాన్ని ముందుగానే తెలియజేయాలి.

క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ శిక్షణ:

నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ు: ఎంపికైన వారికి శిక్షణ భిన్నంగా ఉంటుంది. వీరికి ఎజిమలలోని నేవల్ అకాడమీలో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత అప్లైడ్ ఎలక్ట్రా నిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లలో ఏదో ఒక బ్రాంచ్ తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు.

ఫిజికల్ ట్రైనింగ్:

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నిర్దిష్ట వ్యవధిలో మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ (డెహ్రాడూన్), నేవీ క్యాడెట్స్ కు నేవల్ ఆకా డమీ (ఎజిమల), ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్. ఫోర్స్ అకాడమీ  (హైదరాబాద్) లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది.

స్టయిఫండ్ రూ. 56,100:

ఎన్ డి ఎ , ఎన్ ఎ విజేతలకు శిక్షణ సమయంలో పే లెవల్-10కు సమానమైన రూ.58,100 స్టైపెండ్ అందిస్తారు. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ. 56,100-1,77,500 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రారం భంలో ఆర్మీ విభాగంలో లెఫ్టినెంట్ నేవీ విభాగంలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్పోర్స్ విభాగంలో ఫ్లయింగ్ కేడర్ కెరీర్ ప్రారంభమవుతుంది.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 8, 2023

ఆన్లైన్ దరఖాస్తు సవరణ: జూన్ 7- జూన్ 13, 2023

ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 3, 2023

ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: upsconline.nic.in

పూర్తి వివరాలకు వెబ్సైట్: www.upsc.gov.in

Post a Comment

0 Comments