GET MORE DETAILS

సీపెట్... కొలువుల నెలవు. ఏపీకి తలమానికంగా నిలిచిన సీపెట్ - జూన్ 11వ తేదీన సీపెట్ అడ్మిషన్ టెస్ట్

 సీపెట్... కొలువుల నెలవు. ఏపీకి తలమానికంగా నిలిచిన సీపెట్ - జూన్ 11వ తేదీన సీపెట్ అడ్మిషన్ టెస్ట్



● ఏపీకి తలమానికంగా నిలిచిన సీపెట్

● జూన్ 11వ తేదీన సీపెట్ అడ్మిషన్ టెస్ట్

కోర్సు పూర్తవుతున్న సమయం లో ఉద్యోగం లభించేలా సీపెట్ కోర్సులు అందుబా టులో ఉన్నాయి. పదోతరగతి విద్యార్హతతో మూడేళ్ల డిప్లొమా కోర్సులు చేసి జూనియర్ ఇంజినీర్గా ప్లాస్టిక్ రంగంలో రాణించొచ్చు. సెంట్రల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ దేశవ్యాప్తంగా 42 కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి విజయవాడ సమీ పంలో, కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరం పల్లిలో ఉంది. సీపెట్ కోర్సులకు దరఖాస్తు గడువు ఈ నెల 28వ తేదీతో ముగిసింది. అర్హత ఉండి, ప్లాస్టిక్ రంగంలో ఇంజినీర్లుగా స్థిరపడాలనుకునే వారు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని సీపెట్ జాయింట్ డైరె క్టర్ అండ్ హెడ్ డాక్టర్ చింతా శేఖర్ తెలిపారు. 

మూడేళ్ల డీపీఎంటీ, డీపీటీ కోర్సులు

విజయవాడ నగరానికి దగ్గరలో సూరంపల్లి వద్ద 2016లో సీపెట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థలో 10వ తరగతి పూర్తి చేసిన వారికి మూడేళ్ల కాలపరిమితితో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ) కోర్సుల్లో చేరేందుకు సీపెట్ అవ కాశం కల్పిస్తోంది. డీపీటీ చదివిన వారు జూనియర్ ఇంజినీర్లుగా ఉద్యోగంలో చేరి ఉద్యోగోన్నతులతో సీఈఓగా ఎదిగే అవకాశం ఉంది. డీపీఎంటీ వారు టూల్ మేకర్లు, డిజైనర్లుగా రాణించి ఇండస్ట్రీలను స్థాపించే ఎంటర్ ప్రెన్యూర్లుగా చదివిన ఉన్నతి సాధిస్తారు.

బీఎస్సీ అర్హతతో రెండేళ్ల పీజీ కోర్సు 

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ పీజీడీ-పీపీటీ కోర్సును రెండు సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తున్నారు. దీనికి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ చదవాల్సి ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు క్వాలిటీ కంట్రోలర్లుగా, క్వాలిటీ కంట్రోల్ సూపర్ వైజర్లుగా రాణిస్తారన్నారు

ఏటా 150 మందికి అడ్మిషన్లు

డీపీటీ కోర్సులో 60 సీట్లు, డీపీఎంటీ కోర్సులో 60, పీజీలో ఐపీపీటీ కోర్సులో 30 చొప్పున సీట్లు అందు బాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆలిం డియా సీపెట్-క్యాట్ (సీపెట్ అడ్మిషన్ టెస్ట్) పరీ క్షను జూన్ 11వ తేదీన నిర్వహించేందుకు సీపెట్ ఏర్పాట్లు చేస్తోంది

జూనియర్ ఇంజినీర్ నుంచి సీఈఓ వరకు.. 

సీపెట్ కోర్సులు పూర్తి చేసిన వారు జూనియర్ ఇంనీర్లుగా, టూల్ మేకర్లుగా, డిజైనర్లుగా, క్వాలిటీ కంట్రోలర్లుగా, సూపర్ వైజర్లుగా, సీఈఓలుగా రాణి స్తారని యాజమాన్యం తెలిపింది. ప్లాస్టిక్ ఇండస్ట్రీల్లో ప్లానింగ్ హెడ్లుగా ఎదుగుతారని పేర్కొంది. సూరంపల్లి కేంద్రంలో ఇప్పటికే 450 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. 

క్యాంపస్లోనే హాస్టల్ 

క్యాంపస్లోనే హాస్టల్ సౌకర్యం ఉంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల అండతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ విద్యార్థులు సూరంపల్లి కేంద్రంలో చదువుతున్నారు. ట్రైనింగ్ దశలోనే విద్యార్థులను ఉద్యోగాలు వరిస్తున్నాయి.

సీపెట్ ఇంజినీర్ల కోసం కంపెనీల క్యూ

సీపెట్ లో చదువుకున్న విద్యార్థుల కోసం సియాన్, రిలీసియస్, నియాఫ్, ఫైన్ టూల్స్, మదర్సన్, రేణుకా ప్లాస్టిక్స్, ఏసియన్ ఇండ స్ట్రీస్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని సీపెట్ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ చింతా శేఖర్ తెలిపారు. విదేశాల్లో ప్లాస్టిక్ ఇండస్ట్రీలు ఇక్కడ చదువుకున్న విద్యా ర్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చాయని పేర్కొ న్నారు. ముగ్గురు ఇప్పటికే విదేశాల్లో పని చేస్తు న్నారని, పది మంది నిపుణులు కావాలని ఒమన్ దేశం కోరిందని పేర్కొన్నారు. మరి కొన్ని దేశాలు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అనం తపురం, విజయవాడ కేంద్రాలుగా జూన్ 11వ తేదీన సీపెట్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారని వెల్లడించారు.

Post a Comment

0 Comments