GET MORE DETAILS

థైరాయిడ్ గురించి తెలుసుకుందాం! నేడు ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం

థైరాయిడ్ గురించి తెలుసుకుందాం! నేడు ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం



ఆధునిక కాలంలో అనేక రకాల వ్యాధులకు నివారణ చర్యలు రూపొందించినప్పటికీ, మానవుని జీవన విధానంలో మార్పుల వల్ల కొన్ని కొత్త వ్యాధులు వస్తున్నారు. మరికొన్ని పాతవి తిరగబెడు తున్నాయి.వాటిలో ఒకటి థైరాయిడ్‌. థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని విడుదల చేయడం ద్వారా బాడీలో అనేక మెటబాలిక్ ప్రాసెస్‌లని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే థైరాయిడ్ సమస్య వస్తుంది. సాధారణంగా థైరాయిడ్‌ సమస్య రెండు రకాలుగు ఉంటుంది.థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని 'హైపర్ థైరాయిడిజం' అంటారు. తక్కువగా పని చేస్తున్నప్పుడు 'హైపో థైరాయిడిజం' అని పిలుస్తారు.

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్‌ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు ఇబ్బందులు తప్పవు. బరువు పెరగడం/తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్ధకం, సంతానలేమి లాంటి సమస్యలు చుట్టుమడతాయి. మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ.

థైరాయిడ్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ మరియు చికిత్సలపై అవగాహన మరియు అవగాహనను పెంపొందించడానికి మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్  ప్రతిపాదనపై 2008లో ఈ రోజు ఉనికిలోకి వచ్చింది. పబ్లిక్ హెల్త్ అప్‌డేట్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు థైరాయిడ్ రుగ్మతలతో వ్యవహరిస్తున్నారని అంచనా వేయబడింది మరియు ఈ కేసుల్లో 50 శాతం నిర్ధారణ కాలేదు.

హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రత్యేకంగా గోయిట్రోజెన్‌లకు దూరంగా ఉండాలి. గోయిట్రోజెన్లు థైరాయిడ్ గ్రంధి.. పనితీరును ప్రభావం చేస్తుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్,  పాలకూరలో గోయిట్రోజెన్‌ ఉంటుంది. ఈ కూరగాయల్లో ఉండే గోయిట్రోజెన్‌ థైరాయిడ్‌ సమస్యను పెంచుతుంది. థైరాయిడ్‌ పేషెంట్స్‌ ఈ కూరగాయలకు దూరంగా ఉంటే మంచిది.

కాఫీ, టీ, సోడా, చాక్లెట్ లాంటి ఆహారాల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగితే.. మీలో ఆందోళన, భయము, నిద్రలేమి, చిరాకు, అధిక హృదయ స్పందన రేటుకు దారి తీసుస్తుంది.. ద్వారా హైపర్ థైరాయిడిజం లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.అలాగే మద్య పానం,ధూమపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ హెర్బల్‌ టీలు, పండ్ల రసాలు తాగితే మంచిది.ఈ సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే.ఏదైనా అనారోగ్య సమస్య కన్పిస్తే వెంటనే వైద్యులని కలసి, వారి సలహాలతో తగిన మందుల వాడటం మంచిది.


Post a Comment

0 Comments