GET MORE DETAILS

పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి : షావోమి మాజీ సీఈఓ విజ్ఞప్తి

పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి : షావోమి మాజీ సీఈఓ విజ్ఞప్తి ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ స్మార్టు బాగా అలవాటుపడ్డారు. స్మార్ట్ ఫోన్ కేవలం సమాచార మార్పికి మాత్రమే కాకుం డా. గేమింగ్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్సఫర్ ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగంపై అమెరికాకు చెందిన ఒక సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలో అనేక అంశాలు వెలుగు చూశా యి. చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లు వినియోగించడం వల్ల వారి మానసిక ఎదుగుదలపై త్రీవ ప్రభావం పడుతుందని ఈ స్టడీలో తేలింది. చిన్న వయస్సులో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేపిల్లలు, యుక్త వయస్సు వచ్చే సరికి పలు మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టకుని షావోమి ఇండియా మాజీ సీఈఓ మను కుమార్ జైన్ చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని తల్లిదం డ్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పిల్లలు అన్నం తినడంలేదని, అల్లరి చేస్తున్నారని వంటి కారణాలతో వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని ఆయన కోరారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగించిన వారిలో 70 శాతం అబ్బాయిలు, 50 శాతం వరకు అమ్మాయిలు యుక్తవయస్సు వచ్చే సరికి అనేక రకాల మానసిక రోగాల బారిన పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లల బాల్యం ఎంతో విలువైనదని, దాన్ని తల్లిదండ్రులు. గుర్తించాలని కోరారు. పిల్లలకు ఫోన్లకు బదులు ఇతర అంశాలను నేర్పించాలని, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలని కోరారు.

Post a Comment

0 Comments