GET MORE DETAILS

జాతీయ గణాంక దినోత్సవం - భారత గణాంక శాస్త్ర పిత , భారతీయ గణాంకాల పితామహుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి

జాతీయ గణాంక దినోత్సవం -  భారత గణాంక శాస్త్ర పిత , భారతీయ గణాంకాల పితామహుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి



యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

 పిసి మహాలనోబిస్ జూన్ 29, 1893 న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) లో జన్మించారు. భారతదేశంలో మొదటి ప్లానింగ్ కమిషన్ లో సభ్యుడు , రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త, ఎంతో ముందు చూపుతో లక్షాలను నిర్ధేశించుకొని, పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన మహనీయుడు పి.సి. మహలనోబిస్.  కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన మహా వ్యక్తి కూడా ఆయనే. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపనకు కూడా కృషి చేసిన వ్యక్తి. ప్రపంచంలో ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాల యం లో గణాంక శాస్త్రవేత్తగా పని చేశారు.

గణాంక శాస్త్రంలో పి.సి. మహలనోబిస్ అందించిన సేవలను గుర్తించి, భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అవార్డును ప్రధానం చేసింది. 

పి.సి. మహలనోబి స్ జన్మదినం పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం ఒక గణాంక అంశమును నేపథ్యంగా తీసుకొని జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. 

 రష్యా ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టు దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించారు. 1950లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించారు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డారు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం. ఇది మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందినది. వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినారు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించారు.

దేశం అభివృద్ధి సాధించాలంటే పకడ్భందీ ప్రణాళికలు, గణాంకాలు ముఖ్యం. మన దేశం ఎంత అభివృద్ధి సాధించింది అని తెలుసుకోవడానికి, గణాంకాల సేకరణపై ఆ ధారపడి ఉంటుంది. 

మొదటి జాతీయ గణాంకాల దినోత్సవం జూన్ 29, 2006 న  నిర్వహింపబడింది. ఈ రోజు రోజువారీ జీవితంలో గణాంకాలకు  విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయనే దానిపై ప్రజలలో అవగాహన కల్పిస్తుంది.ఇవి అర్ధ శాస్త్రం మరియు గణిత శాస్త్రంలో వార్షిక నివేదికలు తయారు చేయడానికి, పథకాలు అమలు చేయడానికి ఉపయోగపడతాయి.

Post a Comment

0 Comments