రేపు శని త్రయోదశి. శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?
దశరథ కృత శని స్తోత్రం
శనిదేవుడు అంటే చాలా మంది భయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
శని త్రయోదశి అంటే...
శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
ఎలాంటి అభిషేకాలు చేయాలి,ఎలా చేయాలి ?
• శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
• కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు.
• శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాళ్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
• పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.
త్రయోదశి వ్రతం:
శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.
శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు:
° ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.
° ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.
° వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు...
నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.
• వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.
• అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.
• ఎవరితోను వాదనలకు దిగరాదు.
• ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
• ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
• మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.
• కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
• అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.
• జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
• ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.
• అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని ,మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని ,ఆపద కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
• ఎట్టి పరిస్థితులలోను బాధ్యతలను , భవ బంధాలను మరువరాదు.
ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.
దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని పద్మపురాణంలో చెప్పారు.
దశరథకృత శ్రీ శని స్తోత్రం:
ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ
నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ
నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే
నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః
నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ
నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే
నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే
సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ
అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే
తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ
నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే
తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్
దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః*
త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః
ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ
నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో
నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురుమే దేవ వరార్థోహ ముపాగతః
ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ
ఇతి శనిస్తోత్రమ్
0 Comments