కొవ్వును కరిగించే సగ్గు బియ్యం
బరువు తగ్గాలనుకునే వారికి సగ్గు బియ్యం దివ్యౌషధం. సహజంగా బరువు తగ్గాలంటే ప్రతిరోజూ సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోమంటున్నారు నిపుణలు.
సగ్గుబియ్యంలో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలంటే ఇవి తరచుగా వాడితే కచ్చితంగా శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.
పెద్దవారికే కాదు, పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్నపిల్లలకి పెట్టొచ్చు. పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్ధాలు కలవవు.
సాధారణంగా మనం సగ్గుబియ్యాన్ని నీటితో ఉడికించి పాలతో కలిపి తీసుకుంటాం. దీంట్లో చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణసమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు.
0 Comments