GET MORE DETAILS

బిహార్లో టీచర్ పోస్టులకుదేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు: నీతీశ్ సర్కారు ప్రకటన

 బిహార్లో టీచర్ పోస్టులకుదేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు: నీతీశ్ సర్కారు ప్రకటన



బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గారి   ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత కలి గిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్. సిద్దార్థ్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. తాజాగా కేబినెట్ తీసు కున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ నివాస ఆధా రిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలి పారు. ఈ రోజు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్ లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టు లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయ నున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రి యను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments