GET MORE DETAILS

గ్యాస్ ట్రబుల్ కు కమ్మనైన యోగం

గ్యాస్ ట్రబుల్ కు కమ్మనైన యోగం 



ఈనాడు ప్రతి ఇంట్లో గ్యాస్ ట్రబుల్ తో సతమతమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని ఔషధాలు వాడినా తాత్కాలిక ఉపశమనమే గాని శాశ్వత పరిష్కారం లేదు.

ఇంట్లో మీరే సులభంగా స్వయంగా తయారు చేసుకునే వంటింటి యోగం చెబుతున్నాను. వాడుకొని మీకు తగ్గిన తర్వాత పదిమందికి పంచండి.

ఫార్ములా: 100 గ్రాముల వాము (వోమ), 50 గ్రాములు జీలకర్ర మరియు 50 గ్రాముల సోంపు తీసుకోండి. పైవన్నీ విడివిడిగా దోరగా వేయించి మెత్తగా పొడి చేసి జల్లించండి. 30 గ్రాముల సైంధవ లవణం (ఇది ఒక రకమైన ఉప్పు. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ) తీసుకుని పై పొడులలో కలిపి బాగా మిక్స్ చేసి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి.  రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత అరచెంచాపొడిని అరకప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగాలి. గ్యాస్ వెంటనే క్లియర్ అయిపోతుంది.  తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇది ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న ఔషధం మూడు నెలల వరకు దాని క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. అవసరం ఉంటే మళ్లీ తయారు చేసుకోవచ్చు.


సుధాబాల.మానేపల్లి 

వెల్నెస్‌కోచ్ పోషకాహార నిపుణులు.

Post a Comment

0 Comments