GET MORE DETAILS

అంగన్వాడీ చిన్నారులకు తీపి కబురు తెలిపిన జగన్

అంగన్వాడీ చిన్నారులకు తీపి కబురు తెలిపిన జగన్
 



   ఏపీ సీఎం జగన్ అంగన్వాడీ చిన్నారులకు తీపి కబురు తెలిపారు. ఇప్పటీకే స్కూల్ విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు,నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్,కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు,రెండు జతల సాక్సులు,బెల్టు,స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు),పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కింద ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.

  ఇక ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం అద్భుతమైన కిట్లను అందించబోతున్నారు. ఒక పలక,రెండు పెన్సిళ్లు,12 స్కచ్ పెన్సిళ్లు,ఓ రబ్బర్,షార్ప్ నర్ తో కూడిన కిట్టును ప్రతీ విద్యార్థికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా వీటిని చిన్నారులను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించి… వారి చుదువుకు బలమైన పునాదులు వేసేలా ఈ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీని చేపట్టబోతుంది.

   ఇటీవలే జగన్ ప్రభుత్వం 19 రకాల ఆట వస్తులతో ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో కిట్టును అందజేసింది.ఆ కిట్ లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్ బాల్,చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్ బోర్డు,అబాకస్,చెక్క బూట్లు,బిల్డింగ్ బ్లాక్ లు, గమ్ స్టిక్స్,25 ముక్కల రంగుల పేపర్లు,5 సెట్ల వాటర్ కలర్స్,5 సెట్ల స్కెచ్ పెన్నులు,5 ప్యాకెట్ల పెన్సిళ్లు,5 రబ్బర్లు,5 షార్ప్ నర్లు.నమూనాల ట్రేసింగ్ బోర్డు,డాఫ్లి, బ్లోయింగ్ సంగీత వాయిద్యాలు, 20 పలకలు బొమ్మలు తయారు చేసేలా 5 సెట్ల మౌల్డింగ్ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్ ఫ్రీ సుద్ధలు, బంతితో బాస్కెట్ బాల్ హోప్, 20 కథల పుస్తకాలు అందించారు.

Post a Comment

0 Comments