GET MORE DETAILS

జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం

 జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం



జిల్లేడు మనం వినాయకుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అందులో ఉండే ఔషధగుణాలు తక్కువేంకాదు. ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి. అవి తెల్లజిల్లెడు, ఎర్రజిల్లేడు. రధసప్తమి రోజు జిల్లేడు ఆకులు ధరించి స్నానమాచరిస్తే చాలా మంచిదనీ చెబుతారు. జిల్లేడు పూలు,ఆకులు సేకరించేటపుడు ఆ చెట్టు పాలు కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి విషపూరితం. జిల్లేడు ఆకులను సేకరించి నీళ్ళు చేర్చకుండా ఉప్పు వేసినూరుకోవాలి. ఈ పేస్ట్ను కీళ్ళనొప్పులు ఉన్నచోట రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  అలాగే ఈ ఆకులకు ఆముదం రాసి కీళ్ళనొప్పులు ఉన్నచోట కట్టినా కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పుండ్లు, గాయాలపై రాస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

పేస్ట్ లా చేసి కూడా రాయొచ్చు. రాత్రి సమయంలో పీడకలలతో బాధపడేవారికి ఈ చెట్టు వేరుని తలకింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు తగ్గుతాయి. ఇలా చేస్తే ఏమైనా గ్రహదోషాలు ఉన్నా తగ్గుతాయి. తెల్లజిల్లెడుని సిరిసంపదలకు చిహ్నంగా నమ్ముతారు. ఇప్పటికీ కొందరి ఇళ్ళలో తెల్లజిల్లెడు పెంచుకోవడం చూడొచ్చు. సెగగడ్డలు, వేడికురుపులు తగ్గడానికి ఈ ఆకులకు పసుపు కలిపి నూరి రాయాలి. అరికాళ్ళకు, అరిచేతులకు బొబ్బలు వస్తే ఈ చెట్టు పాలు రాయడంవలన తగ్గిపోతాయి. జిల్లేడు పాలల్లో పసుపు కలిపి ముఖానికి రాస్తే ముఖంపై నల్లమచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా అందంగా మారుతుంది. తెల్లజిల్లెడు వేరు బెరడును బోదకాలు చికిత్సలో వాడతారు. వేరు బెరడును నూరి కాలికి పట్టు వేస్తే ఎంతకాలంగా బాధపడుతున్న బోదకాలు కూడా తగ్గుతుంది. 

జిల్లేడు పాలను తెగిన గాయాలపై రాస్తే రక్తస్రావం వెంటనే ఆగుతుంది. గజ్జల్లో బిల్లలు కడితే ఈ చెట్టు ఆకులకు ఆముదం రాసి వేడిచేసి కడితే బిల్లలు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును పొడి చేసి వాడితే ఆస్తమా, బోదకాలు, బ్రాంకైటీస్  చికిత్స కు వాడతారు. జిల్లేడు వేరుని కాల్చి పళ్ళు తోమడానికి వాడతారు. దీనివలన దంతసమస్యలు తగ్గిపోతాయి. పాముకాటు చికిత్స లో కూడా ఈ చెట్టుని ఉపయోగించేవారు. ఈ ఆకుల పేస్ట్ ని పాముకాటు పై రాసి కట్టుకడితే విషప్రభావం తగ్గుతుంది. జిల్లేడు వేరు  బెరడుని నూరి నీటిలో కలపాలి.తర్వాత వడకట్టి ఆ నీటిని కొద్దికొద్దిగా తాగిస్తే పామువిషం విరుగుతుంది. జిల్లేడు ఆకు పొగపీల్చినా ఉబ్బసం తగ్గుతుంది. జిల్లేడు ఆకుతో  ఏ చికిత్స చేసినా ఆ పాలు కంట్లోపడకుండా జాగ్రత్త పడాలి.

Post a Comment

0 Comments