కొవిడ్ అనంతర పరిణామాలతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు: ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి.
కొవిడ్ అనంతర పరిణామాలతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రతీ నలుగురిలో ఒకరికి ఏదో ఒక మానసిక రుగ్మతలు తలెత్తుతున్నాయని పలు సర్వేల్లో తేలిందన్నారు.
గచ్చిబౌలిలోని టెలికంనగర్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా నిర్మించిన ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ (ఐసీజీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కారణంగా చిన్నారులు సెల్‌ఫోన్, ల్యాప్ టాప్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడమే దీనికి ముఖ్య కారణమన్నారు..
0 Comments