కలోంజి - భూమి పైన దొరికే సంజీవిని
కలోంజి... దీన్నే నల్లజీలకర్ర అంటారు. కలోంజిని భూమి పైన దొరికే సంజీవిని అంటారు. రుచికి సువాసన కోసం దీన్ని వంటల్లో ఎక్కువ వాడతారు. విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు కలోంజిలో ఎక్కువగా ఉన్నాయి. జుట్టు పొడిబారటం, వెంట్రుకలు రాలిపోవడం, రంగుమారటం వంటి లక్షణాలు కనిపిస్తే కలోంజి నూనె తలకి మర్దన చేసుకుంటే వెంట్రుకలు బలంగా పెరిగి, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అధిక బరువును నియంత్రిస్తుంది. శరీరంలోని పరాన్న జీవుల్ని బయటకు నెట్టేస్తుంది. రక్తహీనత నివారిస్తుంది. ప్రతి ఉదయం టీ స్పూన్ నల్లజీలకర్రను తేనెతో కలిపి తీసుకుంటే మూత్రపిండాల పనితీరు బావుంటుంది.
0 Comments