ఎపిలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ: కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ప్రతిఏడాదీ పెరుగుతున్నాయి. 2022 23లో రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఒకటో తరగతి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7,47,565 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో 11,348, బీహార్ లో ఉత్తరప్రదేశ్లో 1,26,028, ఝార్ఖండ్లో 74,357, మధ్యప్రదేశ్లో 69,667, పశ్చిమ బెంగాల్లో 54,900 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
%20(21).jpeg)
0 Comments