GET MORE DETAILS

రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఎవరు ఎంత చందాలు ఇచ్చారు ?

 రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఎవరు ఎంత చందాలు ఇచ్చారు ?రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి (ఆగష్టు 22 1869 ) జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటూ...

హాస్టల్ స్థాపన వెనక ఉన్న కారణాలను గమనిస్తే....అప్పట్లో  హైద్రాబాదు నగరములో ఒకే హిందూ హోటలుండెది.అక్కడ భోజన వసతుల సౌకర్యం సరిగా ఉండేది కాదు. నగరంలో చదువుకునే  విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది.  సరైన వసతులు లేని హోటల్ కారణంగా ఇబ్బందులు పడేవారు.. వెంకట్రామారెడ్డి ఇది గమనించి, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి  చదువు నిమిత్తం  వచ్చే పేద నిరుపేద యువత కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయాలనే ఆలోచనకి వచ్చాడు.

ఇట్లుండగా  వనపర్తి మహారాజు , వెంకట్రామారెడ్డి సహాధ్యాయి, బంధువు, రెండవ రాజా రామేశ్వరరావు బహదూర్ గారి రెండవ కూతురు యువరాణి జానమ్మ   వివాహం సిర్నాపల్లి  యువరాజు రాజా రామలింగారెడ్డికి ఇచ్చి వివాహము జరప నిశ్చయమైనది. 1916 లో జరిగిన ఈ పెళ్లికి అతిరథ మహారథులు వచ్చేశారు. వెంకట్రామారెడ్డి కూడా ఆ వివాహానికి హాజరై వివాహానికి విచ్చేసిన అతిరథ మహారథులతో సమావేశమై....  " ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు, ఉండి కూడా, మన పేద  నిరుపేద  విద్యార్థులకు  సహాయం చేయలేకపోతున్నామా  అంటూ ఆలోచన చేశాడు. భావితరాలకు విద్య అవసరాన్ని గుర్తించి విద్యాసౌకర్యాలు  ఏర్పాటు చేయుట కోసం తనదైన అభిప్రాయాన్ని వినిపించాడు. స్పందించిన పెద్దలు వెంటనే తన వంతు సహాయాన్ని అందించారు.

పింగళి వేంకట రామిరెడ్డిగారు  20.000 

వనపర్తి మహా రాజుగారు 25.000

 గద్వాల మహారాజు గారు 30,000

 పింగళి కోదండ రామిరెడ్డిగారు 4000

 గోపాలుపేట రాణీగారు 4000

దోమకొండ సంస్థానాధీశ్వరులు రాజారాజేశ్వరరావు   4000

రాజా సురభి వేంకటలక్ష్మారావు బహద్దరు జటప్రోలు రాజు గారు l000

చందాలు వేసారు. వీరందరితో పాటు  పెళ్ళికి వచ్చిన దేశ్ముఖ్ లు , జాగీర్దారులు , భూస్వాములు,  పటేండ్లు,  మొదలుగు వారు తమ శక్తి కొలది ఉదారముగా చందాలు వేసారు.

వసూలైన మొత్తాన్ని వెచ్చించి వెంకటరామిరెడ్డి హైదరాబాదులో  1918లో ఒక అద్దె ఇంట్లో రెడ్డి హాస్టల్ ని ప్రారంభించాడు. పేరుకు రెడ్డి హాస్టల్ కానీ ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఈ హాస్టల్లోనే  ఉండి చదువుకున్నాడు..  విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ భావాలు పెంపొందించడంలో  రెడ్డి హాస్టల్ ఒక శిక్షణాలయంగా ఉండటాన్ని చూసి ప్రేరణ చెందిన ధర్మ బిక్ష గౌడ్, తర్వాతి కాలంలో నల్గొండలో  తాను కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తూ దాని పేరు కూడా "రెడ్డి హాస్టల్ " అని పెట్టుకున్నాడు.


✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి - రాజమహదూర్ వెంకట్రాంరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా...

Post a Comment

0 Comments