GET MORE DETAILS

బహుముఖ ప్రజ్ఞాశాలి "గిడుగు"

 బహుముఖ ప్రజ్ఞాశాలి "గిడుగు"



భాషాశాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంధపరిష్కర్త, శాసనపరిష్కర్త ,పత్రికా రచయిత, ప్రజాస్వామ్యవాది, మానవతావాది గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారు. గిడుగు వీర్రాజు, వెంగమాంబ పుణ్య దంపతులకు 29-08-1863 సo" లో తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం దగ్గరలోని 'ఇందుపల్లి "గ్రామం లో జన్మించినారు.

గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోనికి తీసుకు వచ్చిన మహనీయుడు అచ్చతెలుగు చిచ్చరపిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏకొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలోనికి సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుకే ఆ మహనీయుని పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కేవలం భాషాఉద్యమానికే పరిమితం కాకుండా, పార్లకిమీడి దగ్గర కొండప్రాంతంలో నివసించే "సవరల "కోసం తను సవరభాష నేర్చుకొని, వాచాకములు రాసి, నిఘంటువును తయారు చేసి, తన సొంత ధనంతో బడులు పెట్టించి ముప్పై సంవత్సరాలు వారికి విద్యాభోదన చేశారు.

గిడుగు అంటే మనకు గుర్తొచ్చే మరో మహానుభావుడు గురజాడ. గిడుగు భాషా ఉద్యమానికి గొడుగు పట్టిన గొప్పవ్యక్తి గురజాడ. వీరి బంధం అపూర్వం, అనిర్వచనీయం.

  గిడుగుగారి స్నేహితులంతా ఒక ఎత్తు, ఆప్తమిత్రుడు, ఆత్మీయుడైన గురుజాడ అప్పారావుగారు ఒక ఎత్తు. రెండు వేర్వేరు గ్రామాలనుండి వచ్చిన ఇద్దరు "జీ. వీ."లు (గిడుగు వేంకట రామమూర్తి, గురజాడ వేంకట అప్పారావు ) ఒకే ఏడాది ఒకే బడిలో చదివినారు.

ఇద్దరి మనసులు ఒకటే. మన'సు' కవి ఆత్రేయ గారు రచించిన "స్నేహ బంధము -ఎంత మధురము "అనే గేయంలో "ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలకు "అంటాడు. వీరి స్నేహం పాఠశాలకే పరిమితం కాకుండా, ఒకరికొకరు అండగా ప్రాణం ఉన్నంత వరకు "స్నేహ మధురిమల "సువాసనలు ఆస్వాదిస్తూ ....తెలుగు భాషకు ఎనలేని సేవచేసినారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ.


  జై తెలుగు తల్లి..... జై జై తెలుగు తల్లి

Post a Comment

0 Comments