GET MORE DETAILS

విద్యార్థుల సన్నద్ధతను వీడియో కాల్లో తనిఖీ చేస్తా: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆందోళన

విద్యార్థుల సన్నద్ధతను వీడియో కాల్లో తనిఖీ చేస్తా: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆందోళన



ఫార్మెటివ్-1 పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారో లేదో ఆన్లైన్లోనే తనిఖీ చేస్తాను.. విద్యార్థులు ఆంగ్లంలోనే పరీక్షలు రాయాలి' అంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఫార్మెటివ్-1 పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి విద్యార్థుల సన్నద్ధత, వర్క్ బుక్ ను మంగళవారం ఆన్లైన్లో తనిఖీ చేస్తానని ప్రవీణ్ ప్రకాష్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదేశాలిచ్చారు. కంప్యూటర్ ర్యాండమ్ చెక్ ద్వారా ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసి వీడియోకాల్ చేసి పరీక్షిస్తా నని చెప్పారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులందరూ ఫోన్లను అందుబాటులోకి ఉంచుకోవాలని ఆదేశాలిచ్చారు. ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో ఉండగా ప్రవీణ్ ప్రకాష్ వాట్సప్ వీడియో కాల్లో తనిఖీలంటూ హడావుడి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని, ఏ లోపం గుర్తించినా టీచర్లపైనే చర్యలు తీసుకుంటున్నారని సంఘాల నేతలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments