GET MORE DETAILS

గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం బాధ్యతసచివాలయ హెల్త్ సెక్రటరీలకు: సంక్షేమ శాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు

గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం బాధ్యతసచివాలయ హెల్త్ సెక్రటరీలకు: సంక్షేమ శాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు



గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ సచివాలయాల హెల్త్ సెక్రటరీలకు అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇక నుండి హెల్త్ సెక్రటరీలు తమ సచివాలయాల పరిధిలో వైద్య, ఆరోగ్య పరమైన విధులతోపాటు అదనంగా ఆయా ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ గూడేలు కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల 5 నుంచి 10 వరకు గూడేలు ఉన్నాయి. వాటి మధ్య దూరం కూడా ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సచివాలయం ఉన్న చోటికీ, గూడేలకు సుమారు 25 కిలోమీటర్ల వరకూ దూర ఉ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ విధులతోపాటు అదనంగా అంత దూరం వెళ్లి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను పర్యవేక్షించడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని సచివాలయాల హెల్త్ సెక్రటరీలు చెబుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది ఉంటేనే ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడుతు న్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలకు తప్ప మిగిలిన సాంఘిక సంక్షేమ గురుకులాలతోపాటు గిరిజన, బిసి గురుకులాల విద్యార్థుల ఆరోగ్య అంశాలను ఎప్పటి నుండో ప్రత్యేకంగా ఎఎన్ఎంల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యాన్ని 2019 వరకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు (ఎంపిహెచ్ డబ్ల్యు) కింద హెల్త్ వలంటీర్లు పర్యవేక్షించేవారు. రాష్ట్రంలో 371 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 60 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో సుమారు 1170 మంది హెల్త్ వలంటీర్లు నెలకు రూ.10 వేల వేతనంతో విధులు నిర్వహించేవారు. ఎక్కువగా గిరిజన, ఆదిమ తెగలకు చెందిన వీరు సుమారు 14 ఏళ్ల నుంచి ఈ విధానంలో కొనసాగేవారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలికింది.

Post a Comment

0 Comments