GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం - మన ఆరోగ్యం మన చేతుల్లో

ఆరోగ్యమే మహా భాగ్యం - మన ఆరోగ్యం మన చేతుల్లో "కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్  అవడానికి కారణమయ్యే అలవాట్లు"

1. యూరిన్ కి వెళ్ళకుండా ఆపుకోవడం.

2. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం.

3. ఎక్కువగా మెడిసిన్స్ వాడడం.

4. సిగరెట్స్, పొగాకు.

5. మాంసం ఎక్కువగా తీసుకోవడం.

6. సరిగా నిద్రపోకపోవడం.

7. ఇన్ఫెక్షన్స్.

8. కూల్ డ్రింక్స్.

9. ఎక్కువగా తినడం.

10. ఎక్కువగా లేదా తక్కువగా నీళ్ళు తాగడం.


"పిప్పళ్లతో పలు లాభాలు''

• సమాజంలో పిప్పళ్ల వాడకం చాలా ఎక్కువే వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. స్థూలకాయసన్ని తగ్గించడం నుంచి మొదలుకొని దగ్గు, ఆయాసం దాకా సమసిపోతాయి.

"పిప్పళ్ళ ప్రయోజనాల్లో కొన్ని"...

• 3 గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని ప్రతి రోజూ వేడినీటితో తీసుకుంటే శరీరం బరువు తగ్గుతుంది. ఈ చూర్ణంతో పాటు మోడి ( పిప్పలి వేరు ) కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక పూట జావా మాత్రమే తాగాలి. దప్పిక వేసినప్పుడు గోరువెచ్చని నీరు తాగాలి.

• పిప్పళ్లను తేనెతో సేవిస్తే ఆకలి  పెరుగుతుంది. పులితేన్పులు తగ్గుతాయి.

• నెయ్యితో కలిపిన పిప్పలి కాషాయాన్ని... తేనెతో కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. ఈ సమయంలో రోజూ పాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.

• పిప్పళ్ల చూర్ణాన్ని గానీ, లేదా మిరియాల చూర్ణాన్ని గానీ, సేవిస్తే చాలా కాలంగా బాధించే విరేచనాలు సైతం వేగంగా తగ్గుతాయి.

• పిప్పళ్లను నేతిలో వేయించి, దానికి సైంధవ లవణం చేర్చి మాత్రలుగా చేసి వేసుకుంటే దగ్గు తగ్గుతుంది.

• పిప్పళ్ల చూర్ణాన్ని బెల్లంతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.


"జీర్ణానికి...  జీలకర్ర"

• తాలింపులో ఆవాలతో పారు జీలకర్రను కూడా వాడతాం కదా.. అసలు దీనివల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడయినా ఆలోచించారా.. లేదంటే మాత్రం ఇది చదవండి.

• జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్రతో చేసిన టీని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

• జీలకర్రలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా జరగడానికి అవసరమయ్యే ఎంజైమ్ ల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది.

• జీలకర్రలో ఉండే యాంటి-బ్యాక్టీరియల్, యాంటి- ఇన్ ఫ్లమేటరీ గుణాలు జలుబూ, దగ్గును నివారిస్తాయి. ఇందులోని ఇతర పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి.

• గర్భిణిలు దీన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి మలబధ్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుంది.గర్భిణుల్లో సాధారణంగా కనిపించే వికారాన్నీ జీలకర్ర నివారిస్తుంది. బాలింతలు తీసుకుంటే పాలవృద్ధి బాగుంటుంది.


"సపోటాలతో ఆరోగ్య ప్రయిజనాలు"

• దీనిలోని విటమిన్-ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

• నీరసంగా ఉండి తక్షణమే శక్తి కావాలనుకుంటే రెండు సపోటాలను తింటే సరి.

• జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, మలబద్దకం సమస్య తొలగిపోతుంది.

• గర్భిణులకు మేలు చేస్తాయి. ప్రసవానంతరం తల్లి పాలను వృద్ధి చేస్తాయి.

• నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

• బరువు తగ్గాలనుకునేవారు సపోటాలను ఎక్కువగా తినాలి.


"గుప్పెడు మెంతి ఆకులతో"

• మెంతికూరలో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. ప్రతిరోజూ ఆహారంలో దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

• ఉడకబెట్టిన మెంతికూర ఆకులు జీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయసన్ని చురుకుగా పనిచేయిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి.

• మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్ తో పాటు ప్రోటీన్లు కూడా సంవృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది.

• కీళ్లనొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి.


"సొరకాయ మేలు"

నోట్లో వేసుకోగానే కరిగిపోయేట్టు ఉంటుంది సొరకాయ కూర. ఇది శరీరానికి  చలవ చేస్తుంది. సొరకాయలో కెలోరీలు తక్కువగా ఉంటాయి.  వంద గ్రాముల సొరకాయ ముక్కల్లో కేవలం పదిహేను కెలోరీలు ఉంటాయి. విటమిన్ 'సి', 'బి', ఇనుము, సోడియం, పొటాషియం, వంటి పోషకాలూ సొరకాయ నుంచి లభిస్తాయి.  దీన్లో శరీరంలో త్వరగా కరిగి పోయే కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్య బారిన పడకుండా చూస్తాయి. తరచూ సొరకాయ తినడం వల్ల రక్తంలో  కొవ్వు శాతం అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నావారికి ఇది చాలా మంచిది. నువ్వుల నూనెతో సొరకాయ కూర చేసుకొని తినడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు తరచూ సొరకాయను తీసుకుంటే మంచిది అని చెబుతారు పోషకాహార నిపుణులు.


"బాదం పప్పును నీటిలో నానబెట్టి తింటే"...?

బాదంపప్పును కనీసం 8 గంటలు నీటిలో నానబెట్టి అనంతరం పొట్టు తీసుకుని తింటే ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టుతో సహా బాదంపప్పు తింటే సరిగ్గా జీర్ణం కాదని, పప్పులో ఉండే పోషకాలు శరీరంలోకి చేరవని తెలిపారు. సరిగ్గా జీర్ణం కాకపోతే గ్యాస్, మలబధ్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. వీటిని నీటిలో నానబెట్టి పొట్టు తీసుకొని తింటే సులభంగా జీర్ణం కావడమే కాకుండా మిక్కిలి పోషకాలు లభిస్తాయన్నారు.

Post a Comment

0 Comments