GET MORE DETAILS

ఆరోగ్య మస్తు - మన ఆరోగ్యం మీ చేతుల్లో : పిక్కల నొప్పులు పోవాలంటే ?

 ఆరోగ్య మస్తు - మన ఆరోగ్యం మన చేతుల్లో : పిక్కల నొప్పులు పోవాలంటే ?



 బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తుంటాయి. ఆహారం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకొనే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూవుంటాయి. ఉప్పును పూర్తిగా మాసిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనంచేసేపనికి శరీరం తట్టుకునేట్లు మంచి ఆహారాన్ని తింటే సరిపోతుంది.

చిట్కాలు:

1. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడాతింటే 15, 20 రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.

2. ప్రతి రోజు మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యంగా పాల కూరలాంటి వాటిని రోజు వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది. 

3. పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దన చేసి వేడి నీటి కాపడం పది నిమిషాలు పాటు పెట్టు కుంటే ఆ బడలిక అంతా పోతుంది.

Post a Comment

0 Comments