GET MORE DETAILS

కిచెన్ భారత్ లో... బెడ్రూం మయన్మార్ లో...

 కిచెన్ భారత్ లో... బెడ్రూం మయన్మార్ లో... 



భారత్ లో భోజనం చేసి సెకన్లలోనే మయన్మార్ లో నిద్రపోవచ్చు

ఇంటి వింతగా మాట్లాడుతున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అవునండోయ్. నాగాలాండ్లోని లోంగ్వా గ్రామంలో అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అక్కడి చాలా ఇళ్లు కిచెన్ భారత్లో ఉంటే బెడ్రూం మయన్మార్లో ఉంటుంది. నిజానికి ఈ గ్రామంలోని చాలా ఇళ్ల మధ్య నుంచి రెండు దేశాల సరిహద్దు రేఖ వెళ్లింది. దీంతో ఒక గది ఒక దేశంలో, మరో గది వేరే దేశంలో ఉంటాయి.. ఈ గ్రామంలో కొణ్యక్ తెగకు చెందిన గిరిజన ప్రజలు ఉంటారు.

విషయం ఏంటంటే వారందరికీ రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. అక్కడి యువకులు కొందరు మయన్మార్ - ఎ ఎ సైన్యంలో పని చేస్తుంటే మరికొందరు మాత్రం భారత్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ తెగ ప్రజలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. వీరిని హెడ్ హంటర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గతంలో శత్రువుల తలను నరికి తీసుకురావడం వీరి సంప్రదాయంగా ఉండేదట. అలా తీసుకొచ్చిన తర్వాత గుర్తుగా ఒంటిపై పచ్చబొట్టు వేయించేవారట. ఆ తర్వాత. కాలక్రమేణా ఆ సంప్రదాయం మారింది. ఇప్పుడు సాధారణంగా జీవిస్తున్నారు.

Post a Comment

0 Comments