GET MORE DETAILS

మానవతమూర్తి కలాం గారికి జన్మదిన శుభాకాంక్షలు

మానవతమూర్తి కలాం గారికి  జన్మదిన శుభాకాంక్షలు



ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్

(అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), 

భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.

తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. 

తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. 

చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) 

మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. 

భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 

1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 

కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలుసూచించారు. 

భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న మహానీయునికి జోహార్లు.

Post a Comment

0 Comments