ఆరోగ్యానికి రక్ష - నల్ల ద్రాక్ష
ఈ కాలంలో విరివిగా దొరికే నల్ల ద్రాక్ష రకరకాల ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఏ వయసు వారయినా రోజూ కొన్ని ద్రాక్షలు తింటే ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.
నల్లద్రాక్షలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరి స్తుంటుంది. మధుమేహంతో బాధపడే వారికి ఈ ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇవి గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయని మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు చెబుతున్నారు. వీటిల్లోని ఫైటోకెమిక ల్స్ గుండె కవాటాలు పాడవకుండా కాపాడతాయి. రక్తపోటుతో ఇబ్బంది పడేవారు రోజూ గుప్పెడు నల్ల ద్రాక్ష తినడం మంచిది. దీంతో కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది.
చదువుకునే విద్యార్థులు వీటిని తరచూ తింటే మెదడు చురుగ్గా మారుతుంది. ఏకాగ్రత పెరుగు తుంది. విద్యార్థులకు ఎంత తినిపిస్తే అంత మంచిది. మతిమరుపు సమస్య అంత తేలిగ్గా దరిచేరదు. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు త్వరగా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడ తాయి. నల్లద్రాక్షలో ఫాలిఫినాల్ శాతం ఎక్కువ. ఇది శరీరంలో క్యాన్సర్ కారకాలు ఏర్పడకుండా ఎప్ప టికప్పుడు పోరాడుతుంటుంది. ఎండిపోయిన నల్ల ద్రాక్షను తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. అవి ఆస్టియోపోరోసిస్ కు దూరంగా ఉంచుతాయి. ప్రతిరోజూ పాలల్లో వేసుకొని తింటే స్పష్టమైన కంటి చూపు మెరుగవుతుంది.
0 Comments