GET MORE DETAILS

మెదడు స్వస్థతతో అల్జీమర్స్ దూరం

మెదడు స్వస్థతతో అల్జీమర్స్ దూరంమెదడులో అమైలాయిడ్ ప్రోటీన్లు గుత్తులుగా ఏర్పడటం అల్జీ మర్స్ వ్యాధికి దారితీస్తుందని ఇప్పటికే రుజువు కాగా, దానితోపాటు మొత్తం మెదడు స్వస్థతనూ పరిగణనలోకి తీసుకోవాలని అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ తాజా అధ్యయనంలో తేలింది.

మెదడులో ప్రోటీన్లు గుత్తులుగా ఏర్పడటానికి దశాబ్దాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ 60 ఏళ్లవారితో పోలిస్తే 80, 90 లలో ఉన్నవారిలో ఎక్కువ వేగంగా జరుగుతుంది.

స్కానింగుల్లో ప్రోటీన్ల గుత్తి కనిపించనివారితో పోలిస్తే కనిపించినవారిలో రెండేళ్ళు ముందుగానే చిత్తభ్రంశం (డెమెన్షియా) వస్తోంది. దీనితోపాటు మెదడులో చిన్న రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడటం, మెదడు ముందుభాగమైన కార్టెక్స్లో బూడిదరంగు పదార్థం తరిగిపోవడం కూడా అల్జీమర్స్కు దారితీస్తుంది.

మెదడులో ఈ మార్పులు ఎప్పుడు వస్తాయో ముందుగానే కనిపెడితే సమర్థ చికిత్సకు వీలు కలుగుతుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధ నకు 85 ఏళ్ల వయసులోని 94 మంది వృద్ధులను తీసుకొని, వారు మర ణించేవరకు మెదళ్లలో వచ్చిన మార్పులను గమనించారు.

Post a Comment

0 Comments