GET MORE DETAILS

హార్మోన్ల అసమతుల్యతకు అడ్డుకట్ట

 హార్మోన్ల అసమతుల్యతకు అడ్డుకట్ట



మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య హార్మోన్ల అసమతుల్యత. దీనికి ఎన్నో కారణాలున్నా, తగిన ఆహారం తీసుకుంటే గనుక ఆ ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు.

◆ జింకు సమృద్ధిగా అందడం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇది నాణ్య మైన ముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, మాంసం, పీతల వంటి వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది.

◆ ఎర్ర కందిపప్పు, సోయా బీన్స్, బఠా ణీల వంటి వాటిల్లో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది శరీరానికి తగినంత అందినా హోర్మోన్ల అసమతుల్య తను చాలావరకూ అదుపులో ఉంచొచ్చు.

◆ ఈ సమస్యను అధిగ మించాలంటే నూనె, ఒమెగా-3 ට 5 ఫ్యాటీ ఆమ్లాలు అందే చేపలు తీసుకోవడం మంచిది.

◆ పండ్ల విషయానికొస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే అంత మంచిది. వీటిలో ఫ్లవనాయిడ్లు శరీరానికి సమృ ద్ధిగా అందడం వల్ల హార్మోన్ల అసమతుల్యత నియంత్రణలోకి వస్తుంది.

◆ ఈ ఇబ్బంది ఉన్నవారికి క్యాల్షియం కూడా మేలు చేస్తుంది. అది తగినంత అందితే సమస్య క్రమంగా తగ్గుతుంది. అందుకే పాల ఉత్పత్తులు, ఆకుపచ్చని కాయగూరలు, పాలకూర, అరటికాయ, మెంతి, క్యాబేజీ వంటివి ఆహారంతోపాటు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

◆ పీచు, సంక్లిష్ట పిండిపదార్థాలు శరీరానికి సమృద్ధిగా అందాలి. అందుకు తృణధాన్యాలు సరైన ఎంపిక. తృణధాన్యాలను నేరుగా తీసుకోలేనివారు తృణధాన్యాలన్నీ కలిపి తయారుచేసిన పిండిని ఎంచుకోవచ్చు. ఇది బజార్లో దొరుకుతుంది. దీంతో రకరకాల పదా ర్థాలు చేసుకోవచ్చు.

◆ హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఉదయం పూట నడక అలవాటు చేసుకుంటే జీవక్రియ వృద్ధి పెరిగి పలు రకాల ఇబ్బందులు దూరమ వుతాయి. లేదంటే అరగంట యోగా చేయొచ్చు.

Post a Comment

0 Comments