GET MORE DETAILS

జిడ్డు సమస్య బాధిస్తుందా...!

 జిడ్డు సమస్య బాధిస్తుందా...!



కాలం ఏదయినా చర్మం జిడ్డుగానే కనిపిస్తుంటుంది కొందరికి. ఇలాంటివారు ఎన్ని రకాల క్రీములు రాసుకున్నా సరే ముఖంపై జిడ్డు పేరుకుని అలంకరణ చేసుకున్న తక్కువ సమ యంలోనే మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

పసుపు: దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి... మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకో వాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.

వంట సోడా: చెంచా నిమ్మరసంలో అరచెంచా బేకింగ్ సోడా, కాస్త నిమ్మరసం కల పాలి. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట... ఈ మిశ్రమాన్ని పూతలా వేయాలి. కాసేపయ్యాక తడిచేత్తో మర్దన చేసి ఆ పూతను తొలగించాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. నూనె గ్రంథులు మూసుకుపోతాయి. జిడ్డు సమస్య తగ్గుతుంది.

నిమ్మరసం: జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో కాసిని నీళ్లు కలిసి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసు కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది. జిడ్డు కూడా పేరుకోకుండా ఉంటుంది.

ఉప్పు: స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

మొక్కజొన్న పిండి: ముఖం కడుక్కున్న వెంటనే మొక్కజొన్న పిండిలో నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగే సుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగి స్తుంది. ఈ పూత వేసుకున్నాక మేకప్ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.

టమాటోలు: విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే వాటిల్లో టొమాటో ఒకటి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు టొమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసు కోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

Post a Comment

0 Comments