బాదం నానబెట్టే తింటున్నారా...?
అత్యధికంగా పోషకాలు అందించే పప్పుల్లో బాదం ఒకటి. దీన్ని అలాగే కాకుండా కొన్ని గంటలు నానబెట్టి తీసుకుంటే ఎంతో మంచిది. ఎందుకో తెలుసుకోండి మరి.
◾బాదంలో పీచు, మెగ్నీషియం, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంస కృత్తులు ఎక్కువ. అలాంటి బాదంని నాన బెట్టి తీసుకోవడం వల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇందులోని మోనోశాచు రేటెడ్ కొవ్వులే అందుకు కారణం. బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారమిది.
◾నానబెట్టిన బాదం తినేముందు తప్పకుండా వాటి పొట్టు తీయాలి. ఉదయం పూట ఇవి తింటే గనుక బాదంలోని ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణ వ్యవస్థ పని తీరును వృద్ధిచేసి ఉదర సంబంధిత సమస్యలు బాధించవు.
◾శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటివారు ఈ బాదం తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. హృద్రోగాలూ బాధించవు.
◾రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా ఈ బాదంని తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు రక్త పోటును నియంత్రణలో ఉంచుతాయి.
◾పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు తగ్గుతాయి.
◾గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలలో లోపాలు తలె త్తవు. తల్లీబిడ్డలకు ఇది మేలు చేసే ఆహారం.
0 Comments