GET MORE DETAILS

వేడినీళ్ల లెక్క ఇదీ...

 వేడినీళ్ల లెక్క ఇదీ...



బాగా అలసిపోయిన పుడు వేణ్నీళ్లు పోసుకుంటే... ఆ హాయే వేరు! అవి ఒళ్లు నొప్పు లకూ మంచి పరి ష్కారం. అంతేకాదు, వేణ్నీళ్లు తాగడం వల్లా ఎన్నో లాభాలు న్నాయి. పొద్దున లేవ గానే పరగడుపున కాఫీ, టీలు తాగడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అలాకాకుండా గ్లాసు వేడి నీళ్లని తాగితే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


* మలబద్ధకానికీ ఇది చక్కటి పరిష్కారం. ఉదయాన్నే వేణ్నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. వేణ్నీళ్లతో శరీర ఉష్ణోగ్రతా, దానివల్ల జీర్ణశక్తి పెరుగుతాయి. దాంతో ఎక్కువ కెలొ రీలు ఖర్చవుతాయి. తలనొప్పులకు వేడినీళ్లు మంచి మందు. డైటింగ్ చేస్తున్న వాళ్లకు వేణ్నీళ్లూ, నిమ్మరసం మిశ్రమం చక్కగా పనికొస్తాయి.


* రక్తప్రసరణా, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ ఎంతో తోడ్పడతాయి. జలుబూ, దగ్గూ, గొంతునొప్పితో బాధపడు తున్న వాళ్లు వేడినీళ్లు తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లు తాగడం వల్ల గర్భాశయ కండరాల నొప్పి తగ్గుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పికి ఇది చక్కటి పరిష్కారం.


* వేణ్నీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల వ్యర్థాలు విడుదలై శరీరం శుభ్రపడుతుంది. వయసు కారణంగా వచ్చే మార్పుల్ని ఇది నివారిస్తుంది. మొటిమల కారకాలను పూర్తిగా నిర్మూ లించడంలోనూ ఇది సాయపడుతుంది. వెంట్రుకల మొదళ్లను ఉత్తేజ పరిచి అవి పెరిగేందుకు తోడ్పడుతుంది. ఒత్తైన, మృదువైన జుట్టు మీ సొంతమవుతుంది. మాడు పొడిబారడం, చుండ్రు నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.

Post a Comment

0 Comments