GET MORE DETAILS

ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో...

ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో...



ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.

మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సుల్లో ఉంచుకోండి. అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిమీద సాక్సు వేసుకోండి. పిల్లలకు కూడా ఇది సురక్షితమే.

నిజానికి ఇంగ్లండ్ లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారు.

1. జలుబును తగ్గిస్తుంది మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది. ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సులో ఉంచుకొని, రాత్రంతా అలానే ఉంచండి. ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది.

 2. చెవిపోటు చెవిపోటుగా ఉంటే ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద ఉంచుకోండి. మీకు ఉపశమనంగా ఉంటుంది.

 3. శరీరంలో విషాలను తొలగిస్తుంది ఉల్లిపాయ ముక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలో విషపదార్థాలను పీల్చుకుని, కడుపులో ఆమ్లాలను కూడా తీసేసి ఉపశమనం అందిస్తుంది.

 4. వాచిన గ్రంథులను సరిచేస్తుంది ఏమైనా నాళాలు వాచినా, ఈ ఉల్లిపాయ థెరపీని తప్పక ప్రయత్నించండి. ఒక ఉల్లిపాయ ముక్కను కాలికింద రాత్రంతా ఉంచుకుని చూడండి మీ వాపు ఎలా తగ్గిపోతుందో...

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ... 'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి. ఇంతటి మహత్తరమున్న ఉల్లిగడ్డలను పచ్చివి తిన్నా, ఉడకబెట్టి తిన్నా, ఫ్రైం చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా... కూరలకు అదనపు ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది ఉల్లిగడ్డ. సూప్స్ తయారీలో కూడా ఉల్లిది ప్రధాన పాత్ర.

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్త్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉలిగడ్డలను వైద్య, ఆరోగ్య సంస్థలు ట్యాబ్లెట్స్ తయారీలో వాడుతున్నాయి. అంతేకాదు బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఉందులో పుష్కలంగా ఉన్నాయి.

ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు.

Post a Comment

0 Comments