GET MORE DETAILS

ఈ జ్యూస్లతో డయాబెటిక్ కు చెక్...

 ఈ జ్యూస్లతో డయాబెటిక్ కు చెక్...



రోజురోజుకి మధుమేహం బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఓ అధ్యయనం ప్రకారం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటుందని తేలిందట. ఒక్కసారి దీని బారిన పడితే పూర్తిగా తగ్గించుకోవడం కష్టం. అయితే, కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవచ్చు.

గ్రీన్ టీ: డయాబెటిక్ బాధితులకు గ్రీన్ టీ ఓ దివ్య ఔషధం. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండటంతో శరీరానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. గుండె సమస్యలు, టైప్-2 డయాబెటిక్ వారికి చాలా మంచిది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

కాకరకాయ, బీట్రూట్ జ్యూస్: రోజూ కాకరకాయ లేదా బీట్ రూట్ జ్యూస్ తాగితే డయాబెటిక్ నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయి. బీట్రూట్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది.

కొబ్బరి నీళ్లు: ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ కారణంగా అలసట ఉండదు. కొబ్బరి నీళ్లు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

కీరా జ్యూస్: ఇందులో లభించే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-A, B1, అమైనో యాసిడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్స్ విడుదల సమతూల్యం అవుతుంది.

Post a Comment

0 Comments