చిటికెడు ఇంగువతో కలిగే మేలు...!
అనేకమంది అంతగా పట్టించుకోకపోవచ్చుకాని, చిటికెడంటే చిటికెడు జల్లే ఇంగువ పదార్థాలకు ప్రత్యేక వాసనతోపాటు ఆరోగ్యానికీ మేలుచేస్తుంది.
◾చెట్ల వేర్లనుంచి లభించే ఇంగువ జీర్ణరసాలు ఉత్పత్తికావడానికి తోడ్పడుతుంది.
◾దీనిలో ఔషధ గుణాలు ఉంటాయి.
◾ఇంగువలో ఫాస్పరస్, క్యాల్షి యమ్, ఇనుము, కెరోటిన్, విటమిన్ బి, పీచు, మాంస కృత్తులు పుష్కలంగా ఉంటాయి.
◾రోగనిరోధకశక్తిని పెంచగల గుణాలుంటాయి.
◾క్రమంతప్పకుండా తీసుకుంటుంటే, వైరల్ ఇన్ ఫెక్ష న్లు రావు.
◾మజ్జిగలో చిటికెడు ఇంగువ కలుపుకుని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
◾అల్లం, ఇంగువ, తేనె సమపాళ్ళలో కలుపుకుని తీసుకుంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
0 Comments