GET MORE DETAILS

ఆరోగ్యానికి పాలూ పసుపూ

 ఆరోగ్యానికి పాలూ పసుపూ



గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. యాంటీ సెప్టిక్ గుణాలు శరీరానికి అందుతాయి. పసుపు కలిపిన పాలకు వ్యర్థాలను బయటకు పంపే గుణమూ ఉంది. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ పాలను తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది.. 

పసుపు కలిపిన పాలలో యాంటీవైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగవుతుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట ఈ పాలను తాగడం వల్ల శరీరంలో ఆరోగ్యానికి మేలు చేసే సెరటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తొలగించి హాయిగా నిద్రపోయేందుకు సహకరిస్తాయి. కండరాల నొప్పులూ, కాళ్ల వాపులతో బాధపడే వారు పసుపు పాలను తరచూ తీసుకుంటే మంచిది. కండరాలు దృఢంగా మారతాయి. నొప్పులు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. నెలసరి సమయంలో నడుమూ, కడుపు నొప్పితో బాధపడే వారు ఈ పాలను తాగినా మంచి ఫలితం ఉంటుంది.

Post a Comment

0 Comments