GET MORE DETAILS

కఫానికి ఇంటి వైద్యం - శొంఠి వైద్యం

 కఫానికి ఇంటి వైద్యం - శొంఠి వైద్యం



వర్షాకాలం, శీతాకాలం అంటూ వాతావరణంతో సంబంధం లేకుండా కొందరిని కఫం సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. జలుబు లేకపోయినా నిత్యం గొంతులో ఇది పేరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచాలంటే... ఆయుర్వేద పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...

కఫ ప్రకృతి, ఎలర్జీలు ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది. పెద్దవారిలో ఈ సమస్య ఎక్కువ. కఫం ఉంటే, గొంతులో చిరాకుగా అనిపిస్తుంది. ఇది ఉన్నంతకాలం దగ్గు వెంటాడుతూనే ఉంటుంది.

ఏం చేయాలి...?

చాక్లెట్లు, క్రీం బిస్కట్లు, స్వీట్లు, కేకులు, చల్లని పానీయాలు, పెరుగు, పాలతో తయారయ్యే పాయసం వంటివి మానేయాలి. ఈ పదార్ధాలు గొంతులో కఫాన్ని పెంచుతాయి. వీటితోపాటు గ్రేవీ కూరలకూ దూరంగా ఉండాలి.

• చల్లనినీరు తాగకపోవడమే మంచిది. దాహం వేసినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగాలి. ఆహారంలో మిరియాలు, అల్లం, శొంఠి, పసుపు. వంటివాటిని ఎక్కువగా వాడాలి. ఇవి కఫాన్ని తగ్గిస్తాయి. రాత్రుళ్లు వీలైనంత త్వరగా భోజనం చేయాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు వర్షంలో తడవకుండా జాగ్రత్తపడితే మంచిది.

ఇలా చేయండి:

చిన్న కప్పు నీళ్లల్లో అరచెంచా మిరియాల పొడి వేసి సగం నీరు అయ్యేవరకూ మరిగించి దింపేయాలి. ఈ కషాయాన్ని వడబోసి కొద్దిగా బెల్లం వేసుకుని చెంచాతో కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటే గొంతులో హాయిగా అనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే కఫం సమస్య తగ్గుముఖం పడుతుంది.

• కప్పు పాలల్లో కొద్దిగా శాంతిపొడి వేసి మరిగించి, చిటికెడు పటిక బెల్లం కలపాలి. దీన్ని వేడివేడిగా తాగుతూ ఉంటే కఫం నుంచి ఉపశమనం పొందొచ్చు. గొంతులో హాయిగా ఉంటుంది.

• కప్పు వేడిపాలల్లో అరచెంచా పసుపు కలిపి తాగినా మార్పు కనిపిస్తుంది.

• శొంఠి, మిరియాలు, పిప్పళ్ల పొడులను సమపాళ్లలో తీసుకుని మిశ్రమంలా చేసుకొని భద్రపరుచుకోవాలి. అరచెంచా పొడికి కొంచెం తేనె కలిపి రెండు పూటలా తీసుకుంటే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది.

Post a Comment

0 Comments