GET MORE DETAILS

ఆదివారం (25-02-2024) రాశి ఫలితాలు

ఆదివారం (25-02-2024) రాశి ఫలితాలు

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృషభం:

శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.  వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మిధునం:

వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

కర్కాటకం:

ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసిరావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

---------------------------------------

సింహం:

వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య:

నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

తుల

_ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది._

---------------------------------------

వృశ్చికం:

సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు:

బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

మకరం:

ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

---------------------------------------

_కుంభం:

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

మీనం:

నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

Post a Comment

0 Comments