GET MORE DETAILS

సోమవారం (26-02-2024) రాశి ఫలితాలు

సోమవారం (26-02-2024) రాశి ఫలితాలు 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన  వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో  ప్రోత్సాహకర ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి._

---------------------------------------

వృషభం:

ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు  నిజమవుతాయి.  నూతన  వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  సన్నిహితుల నుండి  ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.

---------------------------------------

మిధునం:

వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఋణదాతల  ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.  ఉద్యోగమున  అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.  ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

కర్కాటకం:

చిన్ననాటి మిత్రుల ఆగమనంతో  గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు  అనుకూల వాతావరణం ఉంటుంది.  సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

సింహం:

దాయదులతో స్ధిరాస్తి  వివాదాలు  పరిష్కారమౌతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి   వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో  సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

కన్య:

ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి  నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు కుటుంబ వ్యవహారాలలో  ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

తుల:

ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని  వ్యవహారాలలో కుటుంబ సభ్యుల  సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట  మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.

---------------------------------------

వృశ్చికం:

కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో  కాని  పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు  మందకోడిగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు.

---------------------------------------

ధనస్సు:

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

మకరం:

ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.  గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు  పెట్టుబడులు అందుతాయి.

---------------------------------------

కుంభం:

ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

మీనం:

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే   విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.  బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

Post a Comment

0 Comments