GET MORE DETAILS

దంతాలు ఆహారం తినేందుకు మాత్రమే

 దంతాలు ఆహారం తినేందుకు మాత్రమే



ఆహారం నమిలి తినేందుకు మాత్రమే మీ దంతాలను వాడండి. ఓపెనర్గా, ప్యాకేజింగ్ టేపు తీసేందుకు, బట్టలు కుట్టేప్పుడు దారం తెంచేందుకు, నట్స్ పగలగొట్టేందుకు మీ దంతాలను ఉపయోగించకండి. మీ దంతాలు చాలా బలంగా ఉన్నాయని పదేపదే ఇలాంటివి చేస్తే పళ్లు వదులు అయి తొందరగా ఊడిపోతాయి.

ఫ్లోరైడ్ బెనిఫిట్స్:

మీరు కొనే టూత్ పేస్టులు, మౌత్ వాషుల్లో ఎటువంటి పదార్థాలున్నాయో చెక్ చేసుకోండి. ఇందులో విపరీతమైన, ఘాటు రసాయనాలు ఉంటే మాత్రం వీటిని కొనకండి. అందుకే ఓరల్ కేర్ ప్రొడక్ట్స్్స్ప ఉన్న ఇంగ్రీడియంట్ లేబుల్ను బాగా చదవండి. ఇందులో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నదాన్నే ఎంచుకోండి. ఫ్లోరైడ్ ఉన్న పేస్టుతో బ్రష్ చేస్తే మీ దంతాలు డ్యామేజ్ కావు, డెంటల్ కేర్లో ఫ్లోరైడ్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎనామిల్ తో జాగ్రత్త:

దంతాలను సంరక్షించే సున్నితమైన పొర ఎనామిల్. ఈ ఎనామిల్ డ్యామేజ్ అయిందో మీకు ఇక సెన్సిటివిటీ, దంతాల నొప్పులు, దంతక్షయం విపరీతంగా పెరుగుతాయి. సోడాలు, షుగరీ డ్రింక్స్, ఆల్కహాల్, ధూమపానంతో మీ దంతాలపై ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. ఇక పళ్ల రసాలు మంచివని ఎక్కువగా తాగుతుంటే మీ పళ్లు త్వరగా పటుత్వం కోల్పోతాయి. అందుకే చక్కెర వేసిన ఇలాంటి జ్యూసులను తగ్గించి, పళ్లను తినండి. ఒకవేళ పళ్ల జ్యూసులు తాగాల్సి వస్తే చక్కెర వేయకుండా తాగండి. ఐస్ ఎక్కువ వేసిన జ్యాసులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ తాగటం, చాలా వేడిగా ఉన్న టీ, కాఫీలు అతిగా తాగటంతో కూడా ఎనామిల్ సమస్యలు వస్తాయి. ఈ చిన్న విషయాలపై జాగ్రత్త వహిస్తే మీకు పంటి సమస్యలు తగ్గుతాయి.

Post a Comment

0 Comments