GET MORE DETAILS

కాళ్లలో తిమ్మిర్లు- నివారణ మార్గాలు

కాళ్లలో తిమ్మిర్లు- నివారణ మార్గాలు 



రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కొందరు కాళ్ల తిమ్మిర్లతో బాధ పడుతుంటారు. ఈ సమయంలో కాళ్ల పిక్కలు పట్టేసినట్లు, నొప్పిగా, అడుగువేయడమే కష్టంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్ర సరిగా ఉండదు. పని ఒత్తిడి, అతిగా నడవటం, వేడి చేయడం వల్ల ఇలా జరుగుతుందేమో అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ తిమ్మిర్లకు కొన్ని కారణాలు ఉన్నాయి. శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం, కండరాల సంబంధిత సమస్యలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

◾శరీరంలో విటమిన్-బి లోపిస్తే ఈ సమస్య కనిపిస్తుంది. దీని కోసం యాపిల్, ఆరెంజ్, కివి, పెరుగు, జున్ను, అరటిపండ్లు, బఠానీలు, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.

◾విటమిన్-డి లోపం వల్ల కూడా రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్ల సమస్యకు కారణం అవుతుంది. ఉదయం సూర్యకాంతిలో కొద్దిసేపు ఉండాలి. కాల్షియం లోపం కూడా దీనికి కారణమే. దీని కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలైన పాలు, బాదం, పెరుగును ఆహారంగా తీసుకోవాలి.

◾ఐరన్ లోపం ఉన్నా కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. బ్రకోలీ, కిడ్నీ బీన్స్, శనగలు, నువ్వులను ఆహారంలో చేర్చుకొని ఐరన్ లోపంను అధిగమించవచ్చు.

◾నారింజ, బచ్చలికూర, బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి కండరాల తిమ్మిరిని నివారించడంలో సహాయపడతాయి.

◾కండరాల తిమ్మిరిని నివారించడానికి రోజూ తగినంత నీరు తాగాలి. కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరైనా తీసుకోవడం మంచిది./

Post a Comment

0 Comments