మేష రాశి 2024 :: మేష రాశి వారి 2024 ఆర్థిక విషయాలు
మేష రాశి వారికి గత కొంత కాలముతో పోల్చుకుంటే 2024 సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించును. లాభస్థానములో శని అనుకూలత వలన ధన స్థానములో గురుని ప్రవేశం వలన 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును.మేష రాశి ఫలాలు.. ధన యోగం సహా అన్నీ శుభ యోగాలే.2024వ సంవత్సరం మేషరాశి వారికి బాగా కలసివచ్చేటటువంటి సంవత్సరము. 2024వ సంవత్సరంలో లాభస్థానములో శని మేషరాశి వారికి లాధభదాయకముగా ఉండటం, గురుడు మే మాసములో ధన స్థానములో ప్రవేశించడం, కేతువు 6 స్థానములో అనుకూల స్థితిలో ఉండటం వలన మేషరాశి వారికి 2024 ధనయోగం, శుభయోగం.2024 సంవత్సరం మేషరాశివారికి నూతన వస్తు యోగం, నూతన గృహ యోగం వంటి యోగములు కలుగు అవకాశములు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు 2024లో ప్రమోషన్లు లభించును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభము కలుగును.మేషరాశి వ్యాపారస్తులకు 2024 వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును. వ్యాపారమునందు విజయములు మరియు ధనలాభము కలుగును. ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశివారికి 2024లో ప్రథమార్థంలో స్వల్చ అనారోగ్య సమస్యలు ఏర్పడును.
జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యము అనుకూలముగా ఉండును. మేషరాశి వారికి 2024 సంవత్సరము కెరియర్‌పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం.మేషరాశి వారికి 2024 సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితపరంగా కలసివచ్చేటటువంటి సంవత్సరం, ప్రేమ విషయాలు సఫలీకృతమవుతాయి.అవివాహితులకు వివాహయోగము. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందెదరు.మేషరాశివారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభఫలితాలు పొందుతారని కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగు సంవత్సరము. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయి.2024 సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం ప్రథమార్ధం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం కలసివచ్చును. మేషరాశి వారికి మొదటి 3 నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మధ్యస్థ ఫలితాలు కలుగునని ఆఖరి 9 నెలలలో ప్రేమ జీవితము మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో అనుకూల మరియు అనంద ఫలితాలు లభించును.మేషరాశి దాంపత్య జీవితములో ఉన్న వారికి ఈ సంవత్సరం సుఖము, సౌఖ్యము, అనందము మరియు శారీరక భోగము కలుగును.మేష రాశి వారికి గత కొంత కాలముతో పోల్చుకుంటే 2024 సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించును. లాభస్థానములో శని అనుకూలత వలన ధన స్థానములో గురుని ప్రవేశం వలన 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును.మేషరాశి వారికి జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఆర్థిక విషయాలలో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధించును. మే 2024 నుండి మేషరాశి వారికి ఆర్థికపరంగా లాభము, విజయము కలుగును.మేషరాశి వారికి 2024 ప్రథమార్థం కెరీర్ పరంగా స్వల్చ్బ ఇబ్బందులు మరియు పనుల యందు ఒత్తిళ్ళు ఏర్పడును. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభఫలితాలు కలుగుతున్నాయి.జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు జన్మ గురుని ప్రభావంచేత మేషరాశి వారికి పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు మరియు సమస్యలు వేధించును. మే మాసం నుండి వాక్ స్థానములో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ సమయం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించును.మేషరాశి వారికి గత కొంతకాలముతో పోల్చుకుంటే 2024వ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలముగా ఉండును. మొదటి 5 నెలల్లో అనగా జనవరి 2024 నుండి మే 2024 వరకు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించడం మంచిది. మేషరాశి వారికి ఈ 5 నెలలో టెన్నన్ల వల్ల అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు ఉన్నాయి. మే 2024 నుండి సంవత్సర అంత్యము వరకు మేషరాశి వారికి ఆరోగ్యము అనుకూలించును. అరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది.మేషరాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన వంటివి చేయడం, శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగును.
మేషరాశివారు ధరించవలసిన నవరత్నం పగడము. మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి (అమ్మవారు)
0 Comments