కర్కాటక రాశి 2024 ఫలితాలు
2024 సంవత్సరం కర్కాటక రాశివారికి ఆర్థికపరముగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు. ద్వితీయార్థం జూన్ నుండి డిశంబర్ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 2024లో ఆర్థికపరముగా పురోగతిని పొందెదరు. ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేయాల్సి వచ్చును.
2024వ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానములో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. అయినప్పటికి 2024లో కర్మాటక రాశి వారికి గురుని అనుకూల ప్రభావం చేత, వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందు సూచనలు కనబడుతున్నాయి.కర్మాటక రాశి 2024లో జనవరి నుండి ఏప్రిల్ వరకు శని అష్టమంలో, గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును. 2024 మే నుండి గురుడు లాభస్థానములో అనుకూలముగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా లాభములు చేకూరును. కోర్టు వ్యవహారములు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలుగు సూచన.
2024 ప్రథమార్థంలో కర్కాటక రాశివారు అరోగ్య, కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మొత్తంమీద 2024 కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుచున్నాయి.2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంత కలసిరావు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు వేధించును. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో 2024లో మీయొక్క భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచనలు అధికముగా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఇబ్బందిపెట్టును. ఎదుటివారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన.
2024 సంవత్సరం కర్కాటక రాశివారికి ఆర్థికపరముగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు. ద్వితీయార్థం జూన్ నుండి డిశంబర్ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 2024లో ఆర్థికపరముగా పురోగతిని పొందెదరు. ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేయాల్సి వచ్చును. గత కొంత కాలముతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి గురుని అనుకూలత వలన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కలుగును. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్‌పరంగా అనుకూల ఫలితాలు కలిగించును.
2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశివారు ఆరోగ్య విషయాల యందు కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం వారి స్వంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు కచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ రాశివారు ఆరోగ్యాభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం మంచిది.కర్కాటక రాశి 2024 పరిహారాలు
కర్కాటక రాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం. వేంకటేశ్వరస్వామిని పూజించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
0 Comments