తులారాశి సంబంధ జాతకం 2024
సంవత్సరం మధ్యలో, కొంత గొప్ప ఆనందం ఇంట్లో తట్టవచ్చు. ఈ సమయంలో ఇంట్లో ఒక శుభ కార్యక్రమం ఉండవచ్చు. తల్లి ఆరోగ్యంలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, అంతా సవ్యంగా ఉంటుంది. మీరు మీ పనిలో బిజీగా ఉంటారు, ఈ సందర్భంలో మీరు మీ కుటుంబానికి తక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నూతన సంవత్సరంలో తులా రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది. కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్యం ప్రకారం, తులా రాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణంగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడి ప్రభావంతో ఏప్రిల్ నెల వరకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు, తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మే మాసం నుంచి గురుడు ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడొచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాహువు, కేతువులు ఈ రాశి నుంచి ఆరు, పన్నెండో స్థానంలో సంచారం చేయడం వల్ల తులా రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. గురుడు, కుజుడి గ్రహాల ప్రభావంతో కుటుంబ జీవితంలో ఉత్సాహంగా గడుపుతారు.
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో తులా రాశి వారికి ఏయే శుభ, అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ రాశి నుంచి గురుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలొస్తాయి. ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శని దేవుడు ఐదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే, మంచి విజయాలు సాధిస్తారు. మీరు పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందొచ్చు. సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది.
ఈ రాశి నుంచి ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించనున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో రాజయోగం ఏర్పడి తులా రాశి వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు.గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కొత్త ఏడాదిలో మార్చి 15వ తేదీ తర్వాత శనిదేవుడితో కలయిక జరపనున్నాడు.
ఈ రాశి నుంచి ఐదో స్థానంలో కుజ, శని గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించిన ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని పెంచుకుంటారు.కొత్త ఏడాదిలో రాహువు సంచారం వల్ల తులా రాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. రాజకీయాలలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు, శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాహువు ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.ఈ రాశి నుంచి శుక్రుడు కొత్త ఏడాదిలో మార్చి 31న తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించి మరింత బలవంతంగా మారనున్నాడు. ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రాహువుతో కలిసి సంచారం చేయనున్నాడు. ఏప్రిల్ 24వ తేదీ వరకు రాహువు, శుక్రుని కలయిక జరగనుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేదా మీకిష్టమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు. మీరు భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
ఈ రాశి నుంచి కేతువు పన్నెండో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో తులా రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆధ్యాత్మిక రంగాలపై, రహస్య శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది. వీటిలో పాటు జ్యోతిష్యం, తాంత్రిక శక్తులపైనా ఆసక్తి పెరుగుతుంది. కేతువు సంచారంతో మీడియా, కమ్యూనికేషన్, రచన రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో కెరీర్ పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో బిజీగా ఉంటారు. ఉద్యోగం మారినప్పటికీ మీపై పని ఒత్తిడి ఉంటుంది. అయితే మీకు సహచరులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అధికారుల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వారు విజయం సాధిస్తారు.ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ సంబంధాలలో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు సాగుతాయి. ఇది కాకుండా, సంతానం లేని జంటలు సంతానం పొందొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో మీ భాగస్వామి ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలి.
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. మే తర్వాత ఆరోగ్య పరంగా కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు.ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని, గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి. ‘ఓం శం శనైశ్చరాయ నమః’ ‘ఓం బ్రిం బృహస్పతేయ నమః’ అనే మంత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. అలాగే ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
0 Comments