నట్స్ తో మెరుగైన ఆరోగ్యం!
ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో నట్స్ తో ఒంటికి చాలా మేలు జరు గుతుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరా నికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్ పొందవచ్చు.
• బాదాం, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్, పైన్, పిస్తా పప్పులు మన శరీరానికి కావల్సిన మంచి కొవ్వులు, ప్రొటీన్స్ వంటి పోషకా లను అందిస్తాయి.
• వీటిల్లో ఫైబర్, విటమిన్ బి, ఇ, మినరల్స్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
• బరువు తగ్గించుకునేందుకు నట్స్ తినడం శ్రేయస్కరం. ఇవి తినడం వల్ల భోజనం చేసి నంత సంతృప్తి కలుగుతుంది. ఇవి ఒంటి లోని చెడుకొవ్వులను నియంత్రిస్తాయి.
• నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు ఈ నట్స్ గొప్పగా పని చేస్తాయి.
• గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒమెగా-3 ఫ్యాట్స్ కావాలి. అవి వాల్నట్స్లో ఉంటాయి. వీటిల్లో ఉండే ఏఎల్ యాసిడ్ గుండె సంబంధిత ఆరిథ్మియాస్కు ఉపయో గపడుతుందని స్పానిస్ నిపుణుల అధ్య యనం చెబుతున్నది.
• బాదాంలో తక్కువ స్థాయిలో కేలరీలు, ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. వీటితో పాటుగా అధిక ఫైబర్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు గుండెల్లో మంట, ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పెరిగే కొద్దీ వచ్చే అనా రోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.
• పిస్తా పప్పులు యాంటీ ఆక్సిడెంట్గా పనిచే స్తాయి. ఇవి గామా-టొకోఫెరోల్ రూపంలో ఒంటికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ క్యాన్సర్ కారక కణాలపై పోరాటం చేస్తుంది.
• పిస్తా పప్పుల్లో ఉండే పొటాషియం, మిన రల్స్ నాడీ, కండర వ్యవస్థలు మంచిగా పని చేసేందుకు సహాయపడుతుంది.
• వీటిల్లో ఉండే విటమిన్ బీ6 రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మనసు ఉల్లా సంగా ఉండేలా చేస్తుంది.
0 Comments