పదో తరగతి పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ
చదువుకోవాలనే తపన ఉండాలి కాని వయసుతో సంబంధం లేదని నిరూపించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలానికి చెందిన పెద్దమ్మి. మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి సోమవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపింది. సోమవారం పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు.
0 Comments