GET MORE DETAILS

సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులపై నిఘా: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు - స్పష్టం చేసిన పోలీస్ అధికారులు

సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులపై నిఘా: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు - స్పష్టం చేసిన పోలీస్ అధికారులు



రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్, ఫేసుబుక్ ఖాతాల నిరంతర పరిశీ లన జరుగుతోందని పోలీస్ అధికా రులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దాదాపు లక్షలాది సామాజిక మాధ్యమాల గ్రూపులున్నాయి. వీటిలో కొంత కాలంగా ఇష్టానుసారం పోస్టింగులు పెడుతున్నారు. ఇవి మర్షణలు, పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్లాయి. కీలకమైన ఎన్నికల సమ యంలో సున్నిత అంశాలపై వాస్తవ విరుద్ధ, వివాదాలను ప్రేరేపించే, మత, కుల ఘర్షణలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో గ్రూప్ నిర్వహ ణలో అడ్మిన్ (నిర్వాహకుడి)కు 90 శాతం బాధ్యత ఉంది. అదేవిధంగా సభ్యులనూ బాధ్యు లను చేస్తారు.

అడ్మిన్ బాధ్యతలు:

• వాట్సాప్, ఫేస్ బుక్ లోని ప్రతి పోస్టింగ్కు బాధ్యత తీసుకోవాలి

• గ్రూప్ లో నమోదయ్యే ప్రతి సభ్యుడి పేరు, చిరునామా వంటి విషయాలు అడ్మిన్కు తప్పక తెలిసి ఉండాలి.

• సభ్యులను చేర్చుకునే సమ యంలో వారి అనుమతి తీసుకోవాలి

• అభ్యంతరకర, తప్పుడు వార్త, సమాచారం, పోస్టింగ్, వందంతులపై స్థానిక పోలీసులకు వెంటనే తెలియ జేయాలి.

• నిబంధనలకు విరుద్ధంగా పోస్టిం గ్లలు పెట్టే సభ్యులను వెంటనే తొల గించాలి

• ఇలా చేయని పక్షంలో అడ్మి నేనే బాధ్యుడిగా చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

• అడ్మినే వివాదాస్పద, అభ్యంతర కర, కుల, మత, రాజకీయ వర్గాలను రెచ్చ గొట్టే విధంగా పోస్టింగ్లు పెడితే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్-158ఏ కింద కేసు నమోదు చేస్తారు. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

షేర్ చేయకూడని పోస్టింగులు:

• విద్వేషాలు రెచ్చగొట్టేవి

• తప్పుడు సమా చారం

• తెలియని సమాచారం

• వర్గపోరుకు దారితీసేవి

• మార్పింగ్ చేసిన ఫొటోలు

• తప్పుదారి పట్టించే వివరాలు.

Post a Comment

0 Comments