GET MORE DETAILS

వరాల వసంతం పవిత్ర రంజాన్ మాసం

 వరాల వసంతం పవిత్ర రంజాన్ మాసం



 వరాల వసంతముగా పేర్కొనబడే పవిత్ర  రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం రంజాన్ నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు రంజాన్ మాసం లో ఆచరించే ప్రత్యేకత తరావి ప్రార్థనలు చేపట్టారు. ఈ నెలలో ముస్లింలు 30 రోజులపాటు నిష్ఠగా కఠోర ఉపవాస దీక్షలు చేపడుతారు. ఉపవాస దీక్షలో భాగంగా ఉదయం వేకువజామున నాలుగు గంటలకు అల్పాహారాన్ని స్వీకరించి అప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుమారు 15 గంటలు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరు. కనీసం ఎంగిలిని కూడా మింగకుండా కఠోరంగా ఉపవాస దీక్షలు చేపడుతారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు సూర్యాస్తమయం అయ్యాక ఖర్జూరంతో ఉపవాస దీక్షను విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. ఇస్లాం కాలమానంలోని తొమ్మిదవ మాసం రంజాన్. ఈ మాసం ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైనది ఈ మాసంలోనే దివ్య ఖురాన్ దివి నుంచి భువి పైకి అవతరింపబడినది

పవిత్ర రంజాన్ మాసం విశ్వ మానవాళి జీవితాలలో సుఖసంతోషాలను, శాంతిని, ప్రగతిని, ఐక్యతను, సోదర భావాన్ని, సౌభ్రాతృ  త్వాన్ని తీసుకురావాలని, ఈ మాసం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని అల్లాను వేడుకుంటూ...

సమూహంలోని ప్రతి ఒక్కరికీ పవిత్ర రంజాన్ మాసం ఆగమనం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Post a Comment

0 Comments