GET MORE DETAILS

12-03-2024 / మంగళవారం / రాశి ఫలితాలు

 12-03-2024 / మంగళవారం / రాశి ఫలితాలు



మేషం:

వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

---------------------------------------

వృషభం:

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు  పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ధన సహాయం  అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

మిధునం:

సంతాన  విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి.  వాహనాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

కర్కాటకం:

దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

సింహం:

ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. గృహమున కుటుంబ సభ్యులతో  సంతోషంగా గడుపుతారు.  బంధువులతో  వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.  చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు  అధిగమిస్తారు.

---------------------------------------

కన్య:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్చడిన వివాదాలు పరిష్కారమవుతాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన  వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు ఉత్సాహనిస్తాయి. భూ క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి.

---------------------------------------

తుల:

వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.    ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

వృశ్చికం:

నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు:

దూర ప్రయాణాలు కలసి వస్తాయి. మిత్రుల నుండి వివాదాలకు సంభందించి  విలువైన సమాచారం సేకరిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.  బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మకరం:

మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  ఆకస్మిక  ప్రయాణ  సూచనలు ఉన్నవి.  సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం  దైవ, సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

కుంభం:

వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.

---------------------------------------

మీనం:

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.  స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో  సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది.  మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు.

Post a Comment

0 Comments