GET MORE DETAILS

అమ్మాయిలూ... ఫోనుతో జాగ్రత్త!

 అమ్మాయిలూ... ఫోనుతో జాగ్రత్త!



అమ్మాయిలకు చేతిలో ఫోను లేకపోతే ఒక్క క్షణం కూడా తోచదు. దాన్ని ఎంత సౌకర్యవంతంగా వాడుతున్నా ఏమరుపాటుగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు. 

ఆడపిల్లవు గంటలు గంటలు ఆ ఫోనులో కబుర్లేంటి! ఎప్పుడు చూసినా ఆ సందేశాలు పంపడం ఏంటి?' అని అమ్మ కోప్పడుతుంటే తమ స్వేచ్ఛని హరిస్తున్నారని భావిస్తారు. అమ్మాయిలు. కానీ అది ఎప్పటికప్పుడు మీ పరిధి దాటొద్దంటూ హెచ్చరిస్తుంది. ముఖాలు చూసుకోకుండా అబ్బాయిలతో చెప్పే కబుర్లు మీకు సమస్యలు తెచ్చి పెట్టొచ్చు.

ఇప్పుడు స్మార్ట్ఫోనుల పుణ్యమా అని వీడి యోలు మిగిలినవారికి పంపడం, ఎదుటివారిని చూస్తూ మాట్లాడటం (వీడియో కాలింగ్) వంటి సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి.. అమ్మాయిలు వీటిని తమ వ్యక్తిగత జీవితం లోకి రానివ్వకపోవడమే మంచిది. తెలియకుం డానే కొన్ని సార్లు వీటివల్ల దుర్మార్గుల ఉచ్చుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

ఇప్పుడు కాల్దరికార్డర్ వంటి సౌకర్యాలూ ప్రతి ఫోనుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఎంత బాగా తెలిసినవారే అయినా మీ కష్టాలను ఫోనులో ఏకరువు పెట్టేయకండి. దాన్ని ఎదుటివారు చనువుగా తీసుకునే ప్రమాదం ఉంది. వాటిని చూపించి తరవాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

కనిపించిన ప్రతియాప్ని వాడాలనుకోవడం కన్నా.. మీ వ్యక్తిగత రక్షణకు ఉపయోగపడేవా టికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వ్యక్తిగత ఫొటోలూ, మీకు సంబంధించిన ధృవ పత్రాలు ఫోనులో ఉంచుకోవద్దు. పొరబాటున ఫోను పోతే అది ఇతరులకు దొరికితే.. అవన్నీ తెలిసి పోతాయి.

వ్యక్తిగత సందేశాలూ, పాస్వర్డులు ఇతర విలువైన సమాచారం ఫోనులో ఉంచినప్పుడు దాన్ని ఏదయినా కారణం చేత ఇతరులకు ఇవ్వాల్సి వస్తే. వాటికి భద్రత ఉండదు. అందుకే తప్పనిసరిగా ప్రతి నెలరోజులకోసారి మీ పాస్వర్డుని మార్చుకోవడం మంచిది.

Post a Comment

0 Comments